రహస్య పెళ్లిపై వివరణ ఇచ్చిన ప్రణీత.. అభిమానులకు క్షమాపణలు!

Published : May 31, 2021, 03:53 PM IST
రహస్య పెళ్లిపై వివరణ ఇచ్చిన ప్రణీత.. అభిమానులకు క్షమాపణలు!

సారాంశం

ప్రణీత ఇంత సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో తాజాగా తన మ్యారేజ్‌పై ప్రణీత స్పందించింది. సోషల్‌ మీడియా ద్వారా తన క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చింది. 

హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ ఆదివారం బెంగుళూర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నితిన్‌రాజు అనే వ్యాపార వేత్తని ఆమె వివాహమాడింది. పూర్తి ప్రైవేట్‌ ఈవెంట్‌గా జరిగిన ఈ మ్యారేజ్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అదే సమయంలో ప్రణీత ఇంత సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో తాజాగా తన మ్యారేజ్‌పై ప్రణీత స్పందించింది. సోషల్‌ మీడియా ద్వారా తన క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చింది. 

ప్రణీత, నితిన్‌ ఇద్దరు కలిసి అభిమానులకు ఓ నోట్‌ని పంచుకున్నారు. ఇందులో చెబుతూ, `మేం మే 30న అతికొద్ది మందితో వివాహం చేసుకున్నామనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ విషయాన్ని మీకు(అభిమానులు) ముందుగా తెలియజేయనందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. కరోనా నేపథ్యంలో మాకు మ్యారేజ్‌ డేట్‌ ఫైనల్‌ కావడానికి టైమ్‌ పట్టింది. పెళ్లికి ముందురోజే ఫైనల్‌ అయ్యింది. అందుకే ఆ విషయాన్ని తెలపలేకపోయాం. నిజానికి చాలా రోజులుగా డేట్‌ సెట్‌ కావడం లేదు. మీ ప్రేమ కంటే ఏదీ ఎక్కువ కాదు. దయజేసి మా క్షమాపణలను స్వీకరించండి` అని తెలిపిందీ కొత్త జంట. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?