ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ పక్కా.. శిరీష్‌ `ప్రేమ కాదంట`కి తారల ప్రశంసలు

Published : May 31, 2021, 04:21 PM IST
ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ పక్కా.. శిరీష్‌ `ప్రేమ కాదంట`కి తారల ప్రశంసలు

సారాంశం

అల్లు శిరీష్‌ `ప్రేమ కాదంట` ఫస్ట్ లుక్‌పై పలువరు తారలు ప్రశంసలు కురిపించారు. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ స్టార్స్ నుంచి అభినందనలు రావడంతో శిరీష్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. 

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం `ప్రేమ కాదంట`. శిరీష్‌ బర్త్ డే సందర్భంగా మే 30న ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. రొమాంటిక్‌గా ఉన్న ఈ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తుంది. అను ఇమ్మాన్యుయెల్‌తో ఇంటెన్స్ లుక్‌ ఆకట్టుకుంటుంది. అంతేకాదు పలువరు తారలు ఈ లుక్‌పై ప్రశంసలు కురిపించారు. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ స్టార్స్ నుంచి అభినందనలు రావడంతో శిరీష్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. 

దీనిపై యూనిట్‌ స్పందిస్తూ, `టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఫస్ట్ లుక్‌కి అనూహ్యమైన స్పందన వస్తుంది. లావణ్య త్రిపాఠి నుంచి మొదలుకొని సాయి ధరమ్ తేజ్ పలువురు హీరో హీరోయిన్లు ఈ సినిమా పోస్టర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. లవ్లీ పోస్టర్ అంటూ లావణ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఈ ఏడాది నీకు బ్లాక్ బస్టర్ పక్కా అంటూ సాయి ధరమ్ తేజ్ కూడా విష్ చేశాడు. నిఖిల్, సందీప్ కిషన్, ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రి, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, కమెడియన్ వెన్నెల కిషోర్, రైటర్ గోపీమోహన్, హీరో కళ్యాణ్ దేవ్.. వీళ్లంతా `ప్రేమ కాదంట` పోస్టర్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో ప్రమోట్ చేశారు. దాంతోపాటు పర్సనల్ గా కూడా ఫోన్ చేసి అల్లు శిరీష్ ను అభినందించారు. 

టాలీవుడ్ ప్రముఖుల నుంచే కాకుండా ట్రేడ్ అనలిస్టులు, టీవీ షో పోస్టుల దగ్గర నుంచి కూడా ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తమిళ టీవీ యాంకర్లు దివ్యదర్శిని, నీలకందన్ `ప్రేమ కాదంట` పోస్టర్ గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఇతర ఇండస్ట్రీ నిర్మాతలైన మహేంద్ర సోనీ కూడా ఈ ఫస్ట్ లుక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు శిరీష్, అను ఎమ్మాన్యూయేల్ జోడి చాలా బాగుంది అంటూ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు` అని తెలిపింది. దీనికి రాకేష్‌ శశి దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై తెరకెక్కుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..