పదేళ్ల క్రితమే సెట్‌ అయిన మహేష్‌-రాజమౌళి మూవీ.. తెరపైకి మరో సంచలన కథ.. గూస్‌బంమ్సే.. ?

Published : Apr 10, 2022, 05:18 PM IST
పదేళ్ల క్రితమే సెట్‌ అయిన మహేష్‌-రాజమౌళి మూవీ.. తెరపైకి మరో సంచలన కథ.. గూస్‌బంమ్సే.. ?

సారాంశం

ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో మహేష్‌-రాజమౌళి సినిమా సాగుతుందని విజయేంద్రప్రసాద్‌ కూడా చెప్పారు. ఇదే కాకుండా జక్కన్న మైండ్‌లో మరో సంచలన కథ ఉందట. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది.

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. సినిమా స్టోరీపై విమర్శలున్నా, ఓవరాల్‌గా పలు మెరుపులు, విజువల్‌ వండర్‌గా ఉండటంతో సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియెన్స్. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. మరో నాలుగురోజులపాటు ఈ సినిమా రన్‌ ఉండనుంది. అయితే నెమ్మదిగా ఈ చిత్రం నుంచి బయటపడుతున్నారు జక్కన్న. తాను నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్‌ పెట్టబోతున్నారు. 

రాజమౌళి.. నెక్ట్స్ మహేష్‌బాబు(Mahesh)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ వర్క్ జరుగుతుంది. తండ్రి విజయేంద్రప్రసాద్‌ వర్క్ చేస్తున్నారు.బేసిక్‌ లైన్‌ ఉందని, దాన్ని కూర్చొని వర్కౌట్‌ చేసి కథగా మలచాలని ఇటీవల రాజమౌళి తెలిపారు. కానీ ఇప్పుడు రాజమౌళి మదిలో రెండు స్టోరీలున్నాయట. ఇప్పటికే వినిపిస్తున్న ఓ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాహసవీరుడి కథతో ఈ సినిమా ఉంటుందని ఓ వార్త బయటకు వచ్చిన విసయం తెలిసిందే. ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో సినిమా సాగుతుందని విజయేంద్రప్రసాద్‌ కూడా చెప్పారు. 

ఇదే కాకుండా రాజమౌళి మైండ్‌లో మరో స్టోరీ రన్‌ అవుతుంది. హాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన విలియమ్‌ వైలర్‌ `బెన్‌హర్‌`(Ben Hur) సినిమా నుంచి ఇన్‌స్పైర్‌ అయిన స్టోరీ కూడా ఉందని తెలుస్తుంది. 1959లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం `బెన్‌హర్‌` రికార్డులు క్రియేట్‌ చేసింది. అత్యధికంగా ఆస్కార్‌ అవార్డులను(11 విభాగాల్లో) అందుకున్న సినిమాగా నిలిచింది. అణచివేతపై స్వేచ్ఛ కోసం, తన ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ వీరుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అలాంటి కథ నేపథ్యంలో మహేష్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే యాంగిల్‌లోనూ జక్కన్న ఆలోచిస్తున్నారట. మరి ఈ రెండింటిలో దేన్ని వర్కౌట్‌చేస్తారనేది ఆసక్తిగా మారింది. కానీ ఈ సరికొత్త స్టోరీ వార్త గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఈ చిత్రం దాదాపు పదేళ్ల క్రితమే సెట్‌ అయ్యిందట. `బాహుబలి` కంటే ముందే మహేష్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. మహేష్‌కి, రాజమౌళికి ఆ సమయంలోనే కమిట్‌మెంట్‌ ఏర్పడిందని, కానీ అనుకోకుండా అది సెట్‌ కాలేదని, అప్పటి మాట కోసం రాజమౌళి ఇప్పుడు మహేష్‌తో సినిమా చేస్తున్నట్టు ఇటీవల రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలా పదేళ్ల క్రితం రావాల్సిన సినిమా ఇప్పుడు వస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా మహేష్‌-రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అంటే అది మరో స్థాయిలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్‌ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. దాదాపు ఆరేడు వందల కోట్లతో సినిమాని నిర్మించాలనుకుంటున్నారట. కే ఎస్‌ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌