Kangana Ranaut Comments : హృతిక్ రోషన్ ను టార్గెట్ చేస్తూ.. కంగనా రనౌత్ సెన్సేషనల్ కామెంట్స్.!?

Published : Apr 10, 2022, 04:22 PM IST
Kangana Ranaut Comments : హృతిక్ రోషన్ ను టార్గెట్ చేస్తూ..  కంగనా రనౌత్ సెన్సేషనల్ కామెంట్స్.!?

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) వివాదస్పాద  వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. కానీ, తాజాగా కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘లాక్ అప్’ షోలో తన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తన మాజీ ప్రియుడిని టార్గెట్ చేసినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు.

వివాదస్పాద వ్యాఖ్యలు చేసి.. వాటి నుంచి తెలివిగా తప్పించుకోవడం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కే సాధ్యమని చెప్పాలి. కంగనా అటు హీరోయిన్ గా దూసుకుపోతూనే ఇటు రియాలిటీ షో ‘లాక్ అప్’ Lock Uppతో హోస్ట్ గా వ్యవహరిస్తూ మెప్పిస్తోంది. చాలా తక్కువ నిబంధలతో రన్ చేస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణే ఉంది. అయితే ఇటీవల ఎపిసోడ్ లో కగనా రనౌత్ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. 

కంగనా షోలో మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన కుంభకోణం గురించి బయటపెట్టింది. తన వివాహిత సంబంధాన్ని హౌస్ సభ్యులతో పంచుకుంది.  పెండ్లైయిన మగవాళ్లు అందమైన అమ్మాయిలను తమ ‘ఉచ్చు’లోకి దింపుతున్నారు. అమ్మాయిలుగా అలాంటి వారికే ఆకర్షితులవుతున్నారు. నేను వ్యక్తిగత అనుభవం నుండి మాట్లాడుతున్నాను. నేను మీ గురించి మాట్లాడటం లేదు. పెళ్లి చేసుకున్న పురుషులు యువతులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రభావం అమ్మాయిలపై ఉంది. ఇది నా జీవితంలో ఒక పెద్ద కుంభకోణంగా మారింది. పెళ్లైన వ్యక్తిని అతని భార్య నుండి రక్షించగల సామర్థ్యం తామేనని యువతులు భావిస్తున్నారు. కానీ ఆ పురుషుడి భార్య కథ వింటే మీరు షాక్ అవుతారు’ అని చెప్పుకొచ్చింది.  

అయితే కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) ను టార్గెట్ చేస్తున్నట్టుగా ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.  హృతిక్ రోషన్ యంగ్ బ్యూటీ సబా ఆజాద్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమెతో కలిసి తిరుగుతూ కనిపించడంతో కంగనా ఆమె మాజీ ప్రియుడైన హృతిక్ రోషన్ పై మండిపడుతున్నట్టుగా పలువురు నెటిజన్లు అభిప్రాపడుతున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?