Sita Ramam Glimpse : సీతారాముల గురించి తెలుసుకుంటున్న రష్మిక.. ఏం చేయబోతోంది?

Published : Apr 10, 2022, 03:16 PM ISTUpdated : Apr 10, 2022, 05:26 PM IST
Sita Ramam Glimpse : సీతారాముల గురించి తెలుసుకుంటున్న రష్మిక.. ఏం చేయబోతోంది?

సారాంశం

ఆల్ ఇండియా క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస చిత్రాలతో అలరిస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తోంది. తను తాజాగా నటించిన చిత్రం ‘సీతా రామం’. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు.   

వరుస చిత్రాలతో రష్మిక మందన్న థియేటర్లలో సందడి చేయనుంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోందీ బ్యూటీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషనల్ వచ్చిన పుష్ప (Pushpa:The Rise) చిత్రం తర్వాత బాలీవుడ్, తమిళం, తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తోంది. విరామం లేకుండా ఈ బ్యూటీ షూటింగ్ లలో పాల్గొంటోంది. అన్ని ఇండస్ట్రీలను సుడిగాలిలా చుట్టేస్తోంది. 

రష్మిక తాజాగా నటించిన చిత్రం ‘సీతా రామం : యుద్దంతో రాసిన ప్రేమ కథ’ (Sita Ramam). తమిళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆఫ్రీన్ అనే ముస్టిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది. కాగా, ఈ చిత్రం నుంచి శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ఫస్ట్ గ్లింమ్స్ రిలీజ్ చేశారు. ‘ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్ధం ఆఫ్రీన్... సీతారాములను నువ్వే కాపాడాలి’.. అంటూ ఓ మేల్ వాయిస్ తో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. ఇందుకు రష్మిక ‘సీతారాములు ఎవరు?’.. అని ఆరా తీస్తూ.. ప్రశ్నలు సంధిస్తుంది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకునే సీన్ తో ఎండ్ అవుతుంది. 

ఈ గ్లింప్స్ ను బట్టి చూస్తే..   దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఇద్దరు ప్రేమికులుగా తెలుస్తోంది. వీరిద్దరూ ఓ సమస్యలో చిక్కుకోగా.. వారిని కాపాడేందుకు రష్మిక (ఆఫ్రీన్) ఏం చేస్తుందనేది కథగా ఉండనున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని హను రాఘవపుడి డైరెక్ట్ చేస్తున్నారు. వైజయంతి ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి సారి రష్మిక ముస్లిం మహిళ పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు