అఖిల్ సినిమాతో నాగ్ కి కొత్త టెన్షన్..?

Published : Sep 15, 2018, 11:58 AM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
అఖిల్ సినిమాతో నాగ్ కి కొత్త టెన్షన్..?

సారాంశం

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడు నటించిన రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి.

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడు నటించిన రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. 'హలో' ఓ మోస్తరుగా సక్సెస్ అయినా.. అఖిల్ కి మాత్రం సరైన గుర్తింపు రాలేదు. దీంతో రంగంలోకి దిగిన నాగార్జున అఖిల్ మూడో సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేశాడు.

ఈ క్రమంలో 'తొలిప్రేమ' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో అఖిల్ సినిమాను మొదలుపెట్టాడు. 'తొలిప్రేమ' సినిమా చూసి అఖిల్ ని వెంకీ చేతిలో పెట్టాడు. అఖిల్ మూడో సినిమాను మొదలు పెట్టాలని తొందర పడ్డారే కానీ ప్రోపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లారని తెలుస్తోంది. లండన్ లో షూటింగ్ మొదలుపెట్టిన చిత్రబృందం ఒక షెడ్యూల్ ని పూర్తి చేసింది.

ఆ షెడ్యూల్ పూర్తయిన తరువాత గానీ చిత్రబృందానికి డైరెక్టర్ వద్ద బౌండెడ్ స్క్రిప్ట్ లేదని తెలిసిందట. స్క్రిప్ట్ పరంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చాలానే ఉన్నప్పటికీ డైరెక్ట్ గా సెట్స్ పైకి తీసుకువెళ్లడమేంటని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం నాగార్జునని కూడా బాగా ఇబ్బంది పెడుతోందని సమాచారం. నవంబర్ నుండి సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలి.

దీంతో నాగార్జున స్వయంగా స్క్రిప్ట్ వర్క్ లో కూర్చొని తన సమయం కేటాయిస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ విషయంలో కూడా మిగిలిన చిత్రబృందం సంతోషంగా లేరని టాక్.  

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?