బ్రైట్‌ కలర్‌ లెహంగాలో మహేష్‌ తనయ సితార.. సో క్యూట్‌!

Published : Oct 17, 2020, 08:35 PM IST
బ్రైట్‌ కలర్‌ లెహంగాలో మహేష్‌ తనయ సితార.. సో క్యూట్‌!

సారాంశం

మహేష్‌భాబు తనయ సితార తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొత్త ఫోటోని పంచుకుంది. ఇందులో గ్రీన్‌ కలర్‌ లెహంగా ధరించి ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూ సితార ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ముద్దుల తనయ సితార తన ఇంట్లో సందడి చేస్తుంది. స్కూల్స్ లేకపోవడంతో ఇంట్లోనే సరదాగా గడిపేస్తుంది. మొన్నటి వరకు ఫాదర్‌ మహేష్‌బాబు, అన్నయ్య గౌతమ్‌లతో ఆడుతూ పాడుతూ గడిపింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను మహేష్‌బాబు తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకున్నారు. 

తాజాగా సితార తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొత్త ఫోటోని పంచుకుంది. ఇందులో గ్రీన్‌ కలర్‌ లెహంగా ధరించి ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూ సితార ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది మొత్తం కొత్త బట్టలతో, తనకిష్టమైన బ్రైట్‌ కలర్‌ దుస్తులు ధరించడంతో సాగిందని తెలిపింది. తన కోసం ఈ లెహంగాని తయారు చేసిన మధూస్‌ క్లాసిక్‌ వారికి థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటో విశేషంగా ఆకట్టుకుంటుంది.

మరోవైపు సితార మమ్మి, నటి నమ్రత శిరోద్కర్‌ సైతం ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో సితార బెడ్‌పై దుప్పటి కప్పుకుని నవ్వుతూ ఉంది. ఈ ఫోటో సైతం ముచ్చటగా ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiru Vs Anil: 2027 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. లిస్ట్ లో 6 సినిమాలు, మజా గ్యారెంటీ
చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ