దుబాయ్ లో పార్టీ చేసుకుంటున్న స్టార్స్ వైవ్స్.. ఉపాసన-నమ్రత!

By Sambi ReddyFirst Published Dec 26, 2021, 12:32 PM IST
Highlights

ఉపాసన.. నమత్ర, ఆమె సోదరి శిల్పా, మనీశ్‌ మల్హోత్రా తదితరులకు లంచ్‌ పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

స్టార్స్ వైఫ్స్ నమ్రత శిరోద్కర్ (Namrata shirodkar), ఉపాసన దుబాయ్‌లో పార్టీ చేసుకున్నారు. వీరిద్దరూ ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం మనందరికీ తెలిసిందే. దుబాయ్‌ ఎక్స్‌పో 2020లో భాగంగా వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లి క్రిస్‌మస్‌ పండగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఉపాసన.. నమత్ర, ఆమె సోదరి శిల్పా, మనీశ్‌ మల్హోత్రా తదితరులకు లంచ్‌ పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

'ఇష్టమైనవారితో రుచికరమైన విందు. ఈ మధ్యాహ్నాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశాను. ఉపాసన (Upasana).. నీలా అద్భుతమైన వంటకాలతో విందును ఎవరూ ఇవ్వలేరు. మనీశ్‌.. నిన్నిక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. మనమంతా మరోసారి హైదరాబాద్‌లో ఇలాంటి పార్టీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అది కూడా త్వరలోనే! అందరికీ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది నమ్రత. 'నిజంగా చాలా ఎంజాయ్‌ చేశాం. లవ్లీ మీటింగ్‌. త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ప్లాన్‌ చేద్దాం' అని బదులిచ్చింది ఉపాసన.దుబాయ్ లో నమ్రత అక్కగారైన శిల్పా శిరోద్కర్ నివాసం ఉంటున్నారు. అలా దుబాయ్ మహేష్ ఫ్యామిలీకి చుట్టాల ఊరిలా మారిపోయింది. 

రామ్ చరణ్ (Ram Charan)వైఫ్ ఉపాసన పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఓ స్టార్ హీరో వైఫ్ అనే పేరుకు మించిన ప్రొఫైల్ ఆమె సొంతం. బిజినెస్ ఉమెన్ గా, సోషలిస్ట్ గా, ఫ్యాషన్, డైట్ ఎక్స్పర్ట్ గా ఆమెకు అనేక ఫీల్డ్స్ లో ప్రావీణ్యం ఉంది. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఆమె హాస్పిటల్స్ చైన్ నడుపుతున్నారు. అలాగే ఆమె అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా కూడా ఉన్నారు. కాగా ఉపాసన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. ఇండియన్ ఎక్స్‌పో 2020 (Inidan Expo 2020) లో భాగంగా మోదీతో ఆమె సమావేశమయ్యారు. 

Also read Ntr-Ram Charan: నందమూరి ఫ్యామిలీతో మెగా హీరోల వైరం.. ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్

ఇక భారత ప్రధానిని కలిసిన హ్యాపీ మూమెంట్స్ ని ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాన్ని ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి’’ అని ఉపాసన ట్వీట్ చేశారు.

Also read Samantha Christmas celebrations:మళ్ళీ ఎన్నాళకు సమంత ముఖంలో స్వచ్ఛమైన చిరు నవ్వు..!


 

click me!