నమ్రతను సూపర్ ఉమన్ అంటున్న మహేష్, కెమెరా ముందు ఇద్దరూ అలా

Published : Oct 05, 2021, 08:46 AM ISTUpdated : Oct 05, 2021, 09:20 AM IST
నమ్రతను సూపర్ ఉమన్ అంటున్న మహేష్, కెమెరా ముందు ఇద్దరూ అలా

సారాంశం

ఓ ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత, మహేష్ బాబు(Mahesh babu), సూపర్ స్టైలిష్ గా సిద్ధం కావడం జరిగింది. ఇక నమ్రతతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. 

చాలా కాలం తరువాత మహేష్, నమ్రత కలిసి కెమెరా ముందుకు వచ్చారు. ఓ ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట, సూపర్ స్టైలిష్ గా సిద్ధం కావడం జరిగింది. ఇక నమ్రతతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. నా సూపర్ ఉమెన్ నమ్రతతో ఇంటర్వ్యూలో పాల్గొనడం సంతోషం పంచింది.. అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశారు. 


ఇక నమ్రత వయసులో మహేష్ కంటే పెద్దవారు కావడం విశేషం. వంశీ మూవీ కోసం కలిసి పని చేసిన ఈ జంట, ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత కొన్నాళ్ళు డేటింగ్ చేసిన మహేష్, నమ్రత 2005లో అత్యంత సన్నిహితుల మధ్య, గోప్యంగా వివాహం చేసుకున్నారు. అప్పట్లో మహేష్ వివాహ వార్త సంచలనం రేపింది. 

Related “సర్కారు వారి పాట” లో ఆ మైథిలాజికల్ గెటప్ లో మహేష్?


స్టార్ హీరోయిన్ అయినా కూడా, నమ్రత పెళ్లి అనంతరం సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేశారు. సాధారణ గృహిణిగా పిల్లల బాధ్యతతో పాటు, మహేష్ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. మహేష్ కి సంబంధించిన అనేక విషయాలు నమ్రత స్వయంగా నిర్వహిస్తారు. నిర్మాణ సంస్థ, బిజినెస్ లు కూడా ఆమె నిర్వహిస్తారు. 


ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్ర షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని, మహేష్ భావిస్తున్నారు. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు