ప్రియ ఫిట్టింగ్ మాస్టర్, రవి నటిస్తున్నాడు... ఇక ఆ కంటెస్టెంట్ ఫోటోని కాలితో తన్నిన నటరాజ్ మాస్టర్

Published : Oct 05, 2021, 08:10 AM ISTUpdated : Oct 05, 2021, 04:12 PM IST
ప్రియ ఫిట్టింగ్ మాస్టర్, రవి నటిస్తున్నాడు... ఇక ఆ కంటెస్టెంట్ ఫోటోని కాలితో తన్నిన నటరాజ్ మాస్టర్

సారాంశం

హౌస్ నుండి బయటికి వచ్చిన నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ బజ్ పేరుతో నడుస్తున్న ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన హౌస్ లోని కంటెస్టెంట్స్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అందరూ ఊహించిన విధంగా ఈసారి హౌస్ నుండి మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. వరుసగా సరయు, ఉమాదేవి, లహరి ఎలిమినేట్ కాగా, నాలుగవ వారం నటరాజ్ హౌస్ ని వీడారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో చాలా కాలం ఉంటాడని భావిస్తే, కొద్దిరోజులకే నటరాజ్ తన జర్నీ ముగించాడు. 


ఎవడి మాటా వినడు సీతయ్య అన్న తీరుగా నటరాజ్ ప్రవర్తన సాగింది. విషయం ఏదైనా ఈయన అసలు తగ్గేవాడు కాదు, నేను సింహాన్ని అంటూ, ఎదుటివాళ్లపై విరుచుకుపడేవాడు. హౌస్ నుండి బయటికి వచ్చిన నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వ్యాఖ్యాతగా ఉన్న అరియానాతో హౌస్ లోని కంటెస్టెంట్స్ గురించి తన భావాలు వెల్లడించారు. 


నటరాజ్‌ మాస్టర్‌ విశ్వతో పాటు మరో కంటెస్టెంట్‌ ఫొటోను కింద పడేసి కాలితో తొక్కారు.  ఆయన ఆవేశంతో గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న యాంకర్ అరియానా షాకైంది. తర్వాత మాస్టర్‌.. ఒక్కో కంటెస్టెంట్‌ గురించి మాట్లాడాడు. యాంకర్‌ రవి టాస్క్‌ లు ఆడేటప్పుడు నత్తలాగా, నామినేషన్స్‌లో దగ్గర గుంటనక్కలాగా ఉంటాడని విమర్శించారు. 


శ్వేత.. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనకో ప్రపంచాన్ని సృష్టించుకుందన్నాడు. ప్రియను ఫిట్టింగ్‌ మాస్టర్‌ అని పేర్కొన్నాడు. తర్వాత జెస్సీ గురించి మాట్లాడుతూ.. వీడు పిల్ల బచ్చానే కానీ, మొన్న పులిహోర కలపడానికి ప్రయత్నించగా అది పులిసిపోయింది అని నవ్వేశాడు. శ్రీరామచంద్ర ముద్దపప్పులా వచ్చాడని, అతడు యాక్ట్‌ చేస్తున్నాడని కుండ బద్ధలు కొట్టేశాడు. మొత్తంగా కంటెస్టెంట్స్ పై తన అభిప్రాయాలను ఫ్రీగా వెల్లడించారు. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు