`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్` వ్రాప్‌ అప్‌ పార్టీ.. యూనిట్‌కి నవ్వులు పంచిన సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను

Published : Oct 04, 2021, 09:52 PM IST
`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్` వ్రాప్‌ అప్‌ పార్టీ.. యూనిట్‌కి నవ్వులు పంచిన సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను

సారాంశం

అఖిల్‌, పూజా హెగ్డే నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్‌. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది.

అఖిల్ అక్కినేని(akhil), పూజా హెగ్డే(pooja hegde) జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`(most eligible bachelor). ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. బన్నీవాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్లయింది. 

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్‌. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను సందడి చేశారు. ఇద్దరు కలిసి చిత్ర యూనిట్‌ని కడుపుబ్బ నవ్వించారు. తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ఆద్యంతం ఫన్‌గా సాగిందీ ఈ వ్రాప్‌ అప్‌ పార్టీ. 

ఇక సినిమా విషయానికి వస్తే ప్రేమ, కెరీర్, పెళ్లి చుట్టూ అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించారు దర్శకుడు `బొమ్మరిల్లు` భాస్కర్. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మధ్యలో పెళ్లి, పార్ట్‌నర్ గురించి వచ్చే మాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వస్తుంది.

త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌