మహేష్ బాబు రికార్డులు మొదలెట్టాడు

Published : Mar 08, 2018, 03:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
మహేష్ బాబు రికార్డులు మొదలెట్టాడు

సారాంశం

'ది విజన్‌ ఆఫ్‌ భరత్'  టీజ‌ర్ విడుద‌ల మహేశ్ బాబు డైలాగులు అదుర్స్ అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్న టీజర్

మ‌హేశ్ బాబు, కొర‌టాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోన్న‌ 'భరత్ అనే నేను' సినిమాకు సంబంధించి 'ది విజన్‌ ఆఫ్‌ భరత్' పేరిట నిన్న టీజ‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనబ‌డుతూ, త‌నదైన శైలిలో చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి. ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఈ టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత పెంచేసింది. కాగా, ఈ టీజ‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లోనే కోటి 11 లక్షల డిజిటల్ వ్యూస్ సాధించింది. కానీ లైక్స్ విషయంలో మాత్రం వెనకపడ్డాడు ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మ‌హేశ్ స‌ర‌స‌న‌ కైరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కానుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు