మరోసారి దొరికిపోయిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా. డేటింగ్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

Published : Jun 24, 2023, 01:09 PM IST
మరోసారి దొరికిపోయిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా. డేటింగ్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

సారాంశం

మరోసారి కెమెరాలకు దొరికిపోయారు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా. ఇప్పటి వరకూ రూమర్లుగానే ఉన్న వీరి డేటింగ్ వ్యవహారానికి బలం చేకూరే విధంగా దొరికిపోతున్నారు స్టార్ జంట.   

చాలా కాలంగా విజయ్ దేవరకొం, రష్మిక మందన్న ఇద్దరిపై డేటింగ్ రూమర్లు ఉండగా.. వాటిని నిజం చేస్తూ.. దొరికిపోతున్నారు ఈ ఇద్దరుస్టార్లు. ఇప్పటికే రెండుమూడు సార్లు మీడియా కంట్లో పడ్డ స్టార్ హీరో.. స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఇద్దరు కలసి మరోసారి మీడియా కళ్లకు చిక్కారు. తాజాగా ఈ జంట ఒక కేఫ్‌లో కనపడటం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? అంటూ మళ్లీ చర్చ మొదలైంది. అయితే వీరు కలిసిన  కేఫ్‌లో వీరితో పాటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, ఆనంద్ దేవరకొండ మరియు పెరియా వర్మలు కూడా ఉన్నారు. 

నిజానికి రష్మిక విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది. అతని ప్రతి సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. గతంలో ఇద్దరు కలిసి చాలా చోట్ల జంటగా కనిపించి హాట్ టాపిక్ అవుతూ వచ్చారు. ముంబయ్ లో చాలా సార్లు డిన్నర్ డేట్లకు వెళ్లారు ఈజంట. ఆతరువాత న్యూఇయర్ వేడుకలకలకు కూడా మాల్దీవ్స్ వెళ్లి ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దర వెళ్లనట్టే ఉన్నా.. ఒకే లెకేషన్ లో ఇద్దరు వేరు వేరుగా ఫోటోలు అప్ లోడ్ చేసేసరికి.. ఇద్దరు దొంగాట ఆడుతున్నారంటూ కామెంట్లు వినిపించాయి. 

ఇక ఈ క్రమంలో విజయ్ , రష్మిక  ఇద్దరు మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ కూడా అకేషన్లు ప్రకారం.. కలిసి పార్టీలు చేసుకుంటున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. దాంతో వీరిద్దరు పెళ్ళి చేసుకోవడం ఖాయం అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వల్లే వీరి రిలేషన్ షిప్ గురించి పుకార్లు పుట్టాయని చెప్పాలి. డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది.  దాంతో ఇద్దరి మధ్య ఏదో ఉందీ అంటూ.. వార్తలు గట్టిగా వినిపింయాయి. 

అయితే ఈమధ్య వరుణ్ తేజ్ లాంటి జంటలు చివరి వరకూ సీక్రేట్ గా ఉంది.. సడెన్ గా ఎంగేజ్ మెంట్ పెట్టేసుకుంటున్నారు. దాంతోఈ జంట కూడా అలానే సండెన్ గా పెళ్ళి పీటల ఎక్కే అవకాశం ఉన్నట్టు తెలస్తోంది. మరి ఈ విషయంలో విజయ్ దేవరకొండ కాని.. రష్మిక మందన్నా కాని స్పందిస్తారేమో చూడాలి. ఇప్పటికే వీరిపై రూమర్ల ఘాటు పెరుగుతోంది. మరి ఈసారి అయినా.. ఈ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్