Businessman Rerelease : సూర్య బాయ్ మళ్లీ వస్తున్నాడు.. ‘బిజినెస్ మెన్’ స్పెషల్ షోస్ కు రెడీ.. ఎప్పుడంటే?

By Asianet News  |  First Published Jul 9, 2023, 1:36 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్  సందడి మళ్లీ మొదలు కానుంది. సూపర్ హిట్ మూవీ ‘బిజినెస్ మెన్’ రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్  ఇలా ఉన్నాయి. 
 


సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)  సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఒక్కడు, పోకిరి 4కే వెర్షన్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా మరో సూపర్ హిట్ చిత్రం రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. పూరీ జగన్నాథ్ - మహేశ్ బాబు కాంబోలో రెండోసారి తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ ‘బిజినెస్ మెన్’ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అందింది.

ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో Businessman చిత్రాన్ని కూడా మళ్లీ విడుదల చేయబోతున్నారు. దీంతో మూవీని 4కే వెర్షన్ లో రెడీ చేస్తున్నారు. ఆగస్టు 9న ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ షోస్ ప్రదర్శించబోతున్నారు. ఆ రోజు మహేశ్ బాబు పుట్టినరోజు కావడం విశేషం. ఆ ప్రత్యేకమైన రోజున బిజినెస్ మెన్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. 

Latest Videos

దాదాపు పదేళ్ల కింద ‘బిజినెస్ మెన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2012లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్  నుంచి మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టింది. రూ.90 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగులోని హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సినిమా ఇక్కడ సూపర్ హిట్ కావడంతో బెంగాలీలోనూ రీమేడ్ చేశారు. 

ఆర్ఆర్ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఆర్ఆర్ వెంకట్ నిర్మించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా మహేశ్ బాబు - కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ఇక ఆ తర్వాత పూరీ - మహేశ్ బాబు కాంబో సెట్ అయ్యే అవకాశాలున్నా కుదరలేదు. ప్రస్తుతం మహేశ్ బాబు ‘గుంటూరు కారం’చిత్రంలో బిజీగా ఉన్నారు. ఇటు పూరీ ‘లైగర్’ దెబ్బ నుంచి కోలుకునేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’తో వస్తున్నారు. 

click me!