`జామ్‌ జామ్‌ జజ్జనక..` భోళాశంకర్‌ సెకండ్‌ సాంగ్‌ అప్‌డేట్‌..

Published : Jul 09, 2023, 11:48 AM IST
`జామ్‌ జామ్‌ జజ్జనక..` భోళాశంకర్‌ సెకండ్‌ సాంగ్‌ అప్‌డేట్‌..

సారాంశం

చిరంజీవి హీరోగా నటిస్తున్న `భోళాశంకర్‌` సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి రెండో పాట ని విడుదల చేయబోతున్నారు. సాయంత్రం ప్రోమో రాబోతుంది.

మెగాస్టార్‌ చిరంజీవి నుంచి వస్తోన్న `భోళాశంకర్‌` మూవీపై మాస్‌లో మంచి క్రేజ్‌ నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్‌ ర్యాంపేజ్‌ లా సాగింది. మాస్‌ ఆడియెన్స్ కి ఫీస్ట్ లా ఉంది. సినిమా వచ్చే నెలలో రిలీజ్‌ కాబోతుంది. దీంతో సినిమా నుంచి వరుసగా అప్‌డేట్లు ఇస్తుంది యూనిట్‌. ఇప్పటికే టీజర్‌తోపాటు ఓ సాంగ్‌ని విడుదల చేశారు. ఇది శ్రోతలను ఆకట్టుకోవడంతోపాటు ఫ్యాన్స్ ని అలరించింది. రెండో పాటకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది యూనిట్‌. 

ఇప్పుడు మరో పాటని విడుదల చేయబోతుంది. తాజాగా చిత్ర బృందం ఆ విషయాన్ని వెల్లడించింది. `జామ్‌ జజ్జనక` అంటూ సాగే పాటని రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలిపింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంగ్‌ ప్రోమోని, మంగళవారం పాటని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. ఇందులో చిరంజీవి కలర్‌ఫుల్‌ డ్రెస్‌ ధరించి మాస్‌ స్టెప్పుతో కనిపిస్తున్నారు. ఇది మాస్‌ ఆడియెన్స్ కి, చిరు ఫ్యాన్స్ ని ఊర్రూతలూగించేదిగా ఉండబోతుందని అర్థమవుతుంది. 

సిస్టర్‌ సెంటిమెంట్‌తో రూపొందుతున్న `భోళాశంకర్‌` సినిమాకి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఫెయిల్యూర్‌లో ఉన్న ఆయన ఈ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లిగా స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేష్‌ నటిస్తుండగా, హీరోయిన్‌గా తమన్నా నటిస్తుంది. మహతి స్వరసాగర్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. 

పూర్తి కమర్షియల్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర(అనిల్‌ సుంకర)నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి `వాల్తేర్‌ వీరయ్య`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు చిరంజీవి. అది ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. దీంతో ఇప్పుడు `భోళాశంకర్‌` మూవీపై అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌ కూడా బాగుండటంతో థియేటర్లలో మెగాస్టార్‌ మరోసారి రచ్చ చేయబోతున్నారని చెప్పొచ్చు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే
Nagababu: సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ చేసిన స్టార్ హీరో.. నాగబాబు, భరణి ఇద్దరి సమస్య ఒక్కటే.. అందుకే ఈ బంధం