బిగ్‌బాస్‌ కోసం కదిలివస్తోన్న సూపర్‌ స్టార్‌.. గ్రాండ్‌ ఫినాలేకి మరింత క్రేజ్‌ !

Published : Dec 05, 2020, 10:32 AM IST
బిగ్‌బాస్‌ కోసం కదిలివస్తోన్న సూపర్‌ స్టార్‌.. గ్రాండ్‌ ఫినాలేకి మరింత క్రేజ్‌ !

సారాంశం

చివరి వరకు ఇదే విమర్శలు ఉంటే టోటల్‌ షో మీదే ప్రభావం చూపుతుంది. అయితే ఈ సారి గ్రాండ్‌ ఫినాలే చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారట. గత సీజన్‌లో గ్రాండ్‌ ఫినాలేకి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత సీజన్ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కి ట్రోఫీని, ప్రైజ్‌ మనీ అందించారు.

బిగ్‌బాస్‌ నాల్లో సీజన్‌ పదమూడో వారం ముగింపుకి వచ్చింది. అలాగే షో సైతం ముగియనుంది. మరో రెండు వారాల్లో ఎండ్‌ కార్డ్ పడబోతుంది. దీంతో ఆట మరింత ఉత్కంఠ నెలకొంది. నాగార్జున హోస్ట్ గా రన్‌ అయ్యే ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ కోసం సూపర్‌ స్టార్‌ కదిలిరాబోతున్నారు. మహేష్‌బాబు గ్రాండ్‌ ఫినాలేలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

డిసెంబర్‌ మూడో వారంలో బిగ్‌బాస్‌4 గ్రాండ్‌గా ఫైనల్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. ఈ సారి షో అంత రంజుగా సాగలేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. రానురాను మరింత బోరింగ్‌గా షో సాగుతుందనే కామెంట్‌ వినిపిస్తుంది. పైగా హౌజ్‌లో గేమ్‌ ఆడని, సైలెంట్‌గా ఉన్న వారిని కాపాడుకుంటూ వస్తున్న బిగ్‌బాస్‌, బాగా ఆడేవారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారు. దీంతో అనేక విమర్శలు మూటగట్టుకుంది. 

చివరి వరకు ఇదే విమర్శలు ఉంటే టోటల్‌ షో మీదే ప్రభావం చూపుతుంది. అయితే ఈ సారి గ్రాండ్‌ ఫినాలే చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారట. గత సీజన్‌లో గ్రాండ్‌ ఫినాలేకి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత సీజన్ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కి ట్రోఫీని, ప్రైజ్‌ మనీ అందించారు. ఈ సీజన్‌లో విన్నర్‌కి మహేష్‌బాబు చేతుల మీదుగా ఇప్పించాలని ప్లాన్ చేశారట. ఆయన వస్తున్నారంటే షోకి మరింత క్రేజ్‌ వస్తుంది. అందుకే మహేష్‌ని ఒప్పించారట. అందుకు సూపర్‌ స్టార్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ సీజన్‌ ఫైనల్‌ ఎంతగా ఆకట్టుకోబోతుందో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?