టీవీ రచయిత ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణం..

By Aithagoni RajuFirst Published Dec 5, 2020, 7:57 AM IST
Highlights

 హిందీ టీవీ రచయిత అభిషేక్‌ మక్వానా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయన ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

కరోనా విజృంభన నేపథ్యంలో చాలా మంది టీవీ ఆర్టిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హిందీతోపాటు సౌత్‌ భాషలన్నింటిలో కలిపి పది మందికిపైగా టీవీ నటులు ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. తాజాగా హిందీ టీవీ రచయిత అభిషేక్‌ మక్వానా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయన ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. దాన్ని ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన అవసరాల కోసం తీసుకున్న అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని, తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు, వాటి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్‌ నోట్‌లో అభిషేక్‌ మక్వానా పేర్కొన్నాడు.

 ఈ ఘటనపై అభిషేక్‌ సోదరుడు జెనిస్‌ మాట్లాడుతూ, అన్న చనిపోయిన తర్వాత తనకు నాకు చాలా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని, అన్న తీసుకున్న అప్పులు తీర్చాలని వారు డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలనుంచి కూడా ఫోన్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో నేను ఆయన ఈ మెయిల్స్ చెక్‌ చేసి చూశాను. మొదట ఈజీ లోన్‌ యాప్‌ ద్వారా కొంత మొత్తం లోన్‌ తీసుకున్నారు. ఆ యాప్‌ ముప్పై శాతం అధిక వడ్డీ వసూలు చేసిందని పేర్కొన్నాడు.  అభిషేక్‌ ప్రఖ్యాత సీరియల్‌ `తారక్‌ మెహ్తాకా ఉల్టా చెస్మా`కి ఓ రచయితగా పనిచేశారు. 

click me!