బాలయ్య కొత్త చిత్రం టైటిల్,వింటే కేక అంటారు

By Surya Prakash  |  First Published Dec 5, 2020, 7:40 AM IST

‘బలరామయ్య బరిలో దిగితే..’ అనే టైటిల్ తో రూపొందే చిత్రానికి సైతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కెమెరామెన్ నుంచి డైరక్టర్ గా మారిన సంతోష్‌ శ్రీనివాస్‌ రెడీ చేసిన కథ అది. బాలకృష్ణ - సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో ఈ కథని తెరపైకి  తీసుకెళ్లేందుకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సన్నాహాలు చేస్తోంది. 


బాలకృష్ణ తన స్పీడు పెంచారు. వరస కథలు వినటం, సినిమాలు ఓకే చేయటం చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు ఓకే చేసారు. ఒక సినిమాని కొత్త దర్శకుడు డైరక్ట్ చేయనున్నారు. నాగ శౌర్య ఆ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే ‘బలరామయ్య బరిలో దిగితే..’ అనే టైటిల్ తో రూపొందే చిత్రానికి సైతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కెమెరామెన్ నుంచి డైరక్టర్ గా మారిన సంతోష్‌ శ్రీనివాస్‌ రెడీ చేసిన కథ అది. బాలకృష్ణ - సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో ఈ కథని తెరపైకి  తీసుకెళ్లేందుకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సన్నాహాలు చేస్తోంది. 

 సంతోష్ శ్రీ‌న్‌వాస్‌ ఇప్పటికే  కందిరీగ‌, హైపర్ చిత్రాల‌తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు‌. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ తో `అల్లుడు అదుర్స్‌` తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇది పూర్త‌యిన వెంట‌నే బాల‌కృష్ణ‌ సినిమా ప్రారంభించనున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ లో ఈ క‌థ చెప్పగా వాళ్లు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆ ప్రొడక్షన్ సంస్ద వారే బాల‌య్య‌ని లాక్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈ మేరకు `బ‌ల‌రామ‌య్య బ‌రిలోకి దిగితే..` అనే టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేయించారు. 

Latest Videos

ఇక ఈ సినిమాల తర్వాత బాలయ్య. బి.గోపాల్ తో ఓ సినిమా చేయాల్సివుంది. మరో ప్రక్క శ్రీ‌వాస్ కూడా బాల‌య్య కోసం ఓ క‌థ రెడీ చేస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది.  తాజా చిత్రం విషయానికి వస్తే..‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 106వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. అయితే రీసెంట్ గా మళ్లీ మొదలైంది.
 
బాలయ్యతో తాను తెరకెక్కిస్తున్న చిత్రం పొలిటికల్‌ డ్రామా కాదని, ఓ మంచి సోషల్‌ మెసేజ్‌తో కూడిన కుటుంబకథా చిత్రమని పేర్కొన్నారు. ఈ సినిమాలో బాలయ్య కొత్త క్యారెక్టరైజేషన్‌లో మెప్పించనున్నారని.. వారణాసి బ్యాక్‌గ్రౌండ్‌ గురించి అందరూ చెప్పుకోడానికి కారణమదేనని తెలిపారు. 

click me!