గరుడవేగపై సూపర్ స్టార్ మహేష్ రెస్పాన్స్

Published : Nov 11, 2017, 03:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
గరుడవేగపై సూపర్ స్టార్ మహేష్ రెస్పాన్స్

సారాంశం

గరుడవేగ మూవీపై సూపర్ స్టార్ మహేష్ రెస్పాన్స్ గరుడవేగ తనకెంతో నచ్చిందని ట్వీట్ చేసిన మహేష్ మహేశ్ స్పందనకు తిరిగి థాంక్స్ చెప్పిన రాజశేఖర్

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గరుడవేగ’ మూవీ ఇటీవల విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మూవీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రేట్ అంటూ ట్వీట్స్ చేశారు.



గ్రేట్.. స్క్రిప్ట్, సూపర్ పెర్ఫామెన్స్, ప్రభావవంతమైన స్క్రీన్ ప్లే, స్టన్నింగ్ అండ్ అమైజింగ్ వర్క్ అంటూ హీరో రాజశేఖర్‌పైన, దర్శకుడు ప్రవీణ్ సత్తారు అండ్ టీంపై పొగడ్తల వర్షం కురిపించారు మహేష్ బాబు.

 

ఇటీవల మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ ‘స్పైడర్’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టగా.. తాజాగా తెలుగు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్‌ స్థాయిలో.. ఫామ్‌లో లేని సీనియర్ హీరో రాజశేఖర్‌తో ‘గరుడవేగ’ చిత్రాన్ని తెరకెక్కించి టాలీవుడ్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. ఇలాంటి సందర్భంలో రాజశేఖర్-ప్రవీణ్ సత్తారు స్పై థ్రిల్లర్ మూవీపై స్పైడర్ హీరో మహేష్ ట్వీట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 

కాగా ‘గరుడవేగ’ మిషన్ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్. సుమారు పదేళ్ల తరువాత హిట్ కొట్టిన రాజశేఖర్ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. రాజశేఖర్, పూజా కుమార్‌, శ్రద్ధాదాస్, జీవిత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు తదితరులంతా సక్సెస్ సంబరాల్లో పాల్గొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?