బాహుబలిని మించిన సల్మాన్

Published : Nov 11, 2017, 11:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
బాహుబలిని మించిన సల్మాన్

సారాంశం

సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న టైగర్ జిందా హై మూవీ ఈ మూవీ ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ బాహుబలిని మించిన రికార్డు వ్యూస్ సాధించిన సల్మాన్ మూవీ

పెద్ద హీరోల సినిమాలంటే ప్రతీ విషయంలో రికార్డులపై లెక్కలుంటాయి. లెక్కల్లో సినిమా రిలీజయ్యాక వచ్చే వసూళ్లు మొదలు రిలీజ్ కాకముందు ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ టీజర్ యూట్యూబ్ వ్యూస్ దాకా,  లైక్స్ దాకా ప్రతీది హాట్ టాపిక్ గా మారుతోంది.  ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తాజా సినిమా ‘టైగర్ జిందా హై’ కొత్త రికార్డును నెలకొల్పింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలయిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సల్మాన్ గత సినిమా ‘ట్యూబ్ లైట్’నిరాశ పరిచినా.. ఆ లోటును భర్తీ చేసేలా ఉంది టైగర్ జిందా హై ట్రైలర్.



ఇంకే ముంది.. విడుదల అయిన కొద్ది గంటల్లోనే ఈ సినిమా బోలెడన్ని వ్యూస్ పొందింది. ఇప్పటికే వ్యూస్ విషయంలో ఈ సినిమా మూడు కోట్లకు చేరువ అవుతోంది. అతి తక్కువ వ్యవధిలోనే ఈ స్థాయి వ్యూస్ పొందిన ట్రైలర్ గా టైగర్ జిందా హై రికార్డును స్థాపిస్తోంది. అలాగే ఈ ట్రైలర్ కు భారీ స్థాయిలో లైకులు కూడా దక్కుతున్నాయట.

 

యూట్యూబ్ లో ఈ టైగర్ జిందా హై అఫిషియల్ ట్రైలర్ కు దాదాపు ఏడు లక్షల లైకులు దక్కాయి ఇప్పటి వరకూ. మరే భారతీయ సినిమా ట్రైలర్ కు కూడా ఈ స్థాయిలో లైకులు రాలేదట. బాహుబలి-2 ట్రైలర్ కూడా దాదాపు ఆరున్నర లక్షల లైకులు పొందింది. ఇప్పటికే ఆ నంబర్ ను టైగర్ జిందా హై దాటేసింది.

 

బాహుబలి 2 ట్రైలర్ ను యూట్యూబ్ లో ఇప్పటి వరకూ ఐదు కోట్లా డెబ్బై లక్షల మంది చూశారు. సల్మాన్ సినిమా ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్ కు దగ్గర పడింది. ఈ ఊపు చూస్తుంటే.. త్వరలోనే వ్యూస్ విషయంలో కూడా బాహుబలి 2 రికార్డును సల్మాన్ సినిమా దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్