మహానాయకుడు ప్రీమియర్ షో టాక్.. ఇలా ఎండ్ అయ్యింది!

By Prashanth MFirst Published Feb 21, 2019, 11:16 PM IST
Highlights

మహానాయకుడు మొత్తానికి రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రీమియర్ షోను కొద్దీ సేపటి క్రితమే ప్రదర్శించారు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించి. తన గాంబీర్యమైన నటనతో తెరపై ఎన్టీఆర్ ను చూపించారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ జీవితంలో మెయిన్ పాయింట్స్ టచ్ చేయలేదు. 

బసవతారకం క్యాన్సర్ కి సంబందించిన సన్నివేశాలతో దర్శకుడు క్రిష్ ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేశాడు. ఆమె మరణంతోనే సినిమాకు సింపుల్ గా ఎండ్ కార్డ్ పడుతుంది. ఎన్టీఆర్ జీవితంలో ఆ తరువాత ప్రేక్షకులు ఊహించిన సన్నివేశాలు ఏవి కూడా మహానాయకుడు టీమ్ టచ్ చేయలేదు. అయితే తీసినంత వరకు సినిమా మేకింగ్ పరవాలేదు గాను అవి ఎంతవరకు నిజం అనేది ప్రేక్షకుల ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందని చెప్పవచ్చు. 

సినిమాలో ఎన్టీఆర్ ను హైలెట్ చేస్తూ ఎక్కడా తగ్గకుండా చూపించారు. ఎన్టీఆర్ గెలిస్తే దేశం గెలిచినట్టే.. నన్ను కదిలించారు, ఢిల్లీని కదిలిస్తా' అనే డైలాగ్స్ తో సినిమాలో ఫ్యాన్స్ విజిల్స్ వేయించే విధంగా ఉన్నాయి. బాలయ్య నట పౌరుషం సినిమాలో బాగానే ఉంది గాని కథ గురించి ఆలోచిస్తేనే.. క్లియర్ గా రిజల్ట్ పై అనుమానాలను కలిగిస్తోంది. 

చంద్రబాబు పాత్రలో రానా అక్కడక్కడా బాగానే మెరిశాడు. కానీ సినిమాలో ఆయన పాత్ర పెద్దగా నెగిటివ్ గా ఏమి ఉండదు. ఇది అందరూ ఊహించిందే. ఇక సినిమాలో ఆయన మనవడు దేవాన్ష్ ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో సరికొత్తగా చూపించి బాలయ్య అందరిని ఆశ్చర్యపరిచారు. సినిమాలో ప్రధానంగా పొలిటికల్ ప్రచారాలకు సంబందించిన సీన్స్ డైలాగ్స్ - కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే బసవతారకం ఎమోషనల్ సీన్స్ బావున్నాయి,

click me!