ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్విట్టర్ రివ్యూ!

Published : Feb 22, 2019, 08:12 AM IST
ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్విట్టర్ రివ్యూ!

సారాంశం

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించాడు దర్శకుడు క్రిష్. మొదటిభాగం ఇప్పటికే విడుదలైంది. 

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించాడు దర్శకుడు క్రిష్. మొదటిభాగం ఇప్పటికే విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. 

రెండో భాగం 'మహానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శితమయ్యాయి. నిజానికి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ ప్రీమియర్ షోలు చూసిన కొందరు సినిమా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ముందుగా మహానటి చిత్ర దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాలో బాలయ్య నటనకి 110/100 మార్కులు వేస్తూ చంద్రబాబుగా రానా, ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ అధ్బుత నటన 
కనబరిచారని అన్నాడు. 'బాబు మామూలోడు కాదు' అంటూ సినిమాలో రానా చెప్పే డైలాగ్ ని తన పోస్ట్ లో పొందుపరిచాడు.

ఇక సినిమాలో పోస్ట్ ఇంటర్వెల్ సీన్ అధ్బుతంగా ఉందని అంటున్నారు. ఎన్టీఆర్, బసవతారకంల ఎమోషనల్ బాండింగ్ కూడా బాగా చూపించారని చెబుతున్నారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?