SSMB28 అప్డేట్ కు ముహుర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ దెబ్బకు స్పందించిన నిర్మాత.. రచ్చ రచ్చే

Published : Mar 26, 2023, 05:55 PM ISTUpdated : Mar 26, 2023, 06:03 PM IST
SSMB28  అప్డేట్ కు  ముహుర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ దెబ్బకు స్పందించిన  నిర్మాత.. రచ్చ రచ్చే

సారాంశం

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ నుంచి ఇవాళ రావాల్సిన అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు.   

సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా ఆయా కారణాలతో ఆగుతూ వస్తోంది. ఇక రీసెంట్ గా ఉగాది సందర్భంగా మాస్ ఫీస్ట్ రాబోతుందని మేకర్స్ అప్డేట్ అందించారు. 

SSMB28  అఫిషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రాబోతుంది. అది ఇవ్వాళ ఐదు గంటల వరకే రావాల్సి ఉంది. అప్డేట్ విషయంలోనూ ఆలస్యం అవుతుండటంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. దెబ్బకు నిర్మాత  నాగ వంశీ ట్వీటర్ వేదికన స్పందిచారు. ‘తిట్టకండి 6 తర్వాత మంచి టైమ్ అంట. నన్ను నమ్మండి. మీకు పండగ స్టార్ అవుతుంది.‘ అంటూ అప్డేట్ ఇచ్చారు. 

ఇంకాసేపట్లో SSMB28 నుంచి అప్డేట్ రాబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. క్షణాల్లోనే వైరల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మహేశ్ బాబు ఇప్పటికే న్యూ మేకోవర్ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రం నుంచి తొలిసారిగా రాబోతున్న పోస్టర్ పై మరింత ఆసక్తి నెలకొని ఉంది. 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మహేశ్ బాబు సరసన హీరోయిన్ పూజా హెగ్దే, మరో హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తున్నారు. మరికొంతమంది తారగణం కూడా కీలక పాత్రలను పోషించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు