
సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీ ఇప్పటికే మాంచి బజ్ క్రియేట్ చేసింది. మహేష్ కున్న ఇమేజ్ తో మాంచి బజ్ క్రియేట్ చేసిన స్పైడర్ అదే రేంజ్ లో బిజినెస్ కూడా చేసేస్తోంది. స్పైడర్ విడుదల కాకుండానే పలురకాలుగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నా... అదంతా మహేష్ మ్యానియా ముందు తుడిచి పెట్టుకు పోయింది. ఎందుకంటే ‘స్పైడర్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 156 కోట్ల బిజినెస్ జరగడం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.
స్పైడర్ పాటలకు పెద్దగా చెప్పుకో తగ్గ స్పందన ఇప్పటిదాకా రాకపోయినా ఈమూవీ ఓవర్సీస్ రైట్స్ 23 కోట్లకు అమ్మకం జరగడమే కాకుండా మన తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఏరియాలతో పాటు కోలీవుడ్ మార్కెట్ శాటిలైట్ రైట్స్ డిజిటల్ రైట్స్ ఇలా అన్నీ కలుపుకుని 156 కోట్ల భారీ బిజినెస్ కేవలం మహేష్ మురగదాస్ ల కాంబినేషన్ ను నమ్ముకుని జరగడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఈసినిమాకు పోటీగా ఒక వారం రోజులు ముందుగానే జూనియర్ ‘జై లవ కుశ’ విడుదల అవుతూ ఉన్నా ఈవిషయాలు ఏమీ ‘స్పైడర్’ బిజినెస్ ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.
ఈనెల 9న చెన్నైలో ‘స్పైడర్’ మూవీ ఆడియో ఫంక్షన్ జరుగుతున్న వేదిక పైనే ఈమూవీ తెలుగు ఆడియోను అదేవిధంగా ఈమూవీ ధియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఈమూవీ తెలుగు వెర్షన్ ప్రమోషన్ కు సంబంధించి ఈసినిమా విడుదలకు ఒక పదిరోజులు ముందుగా ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత భారీ స్థాయిలో జరపబోతున్నట్లు టాక్.
చెన్నైలో జరుగుతున్న ఆడియో ఫంక్షన్ కు దర్శకుడు శంకర్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఇక భాగ్యనగరంలో జరగబోయే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాజమౌళితో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులను అతిధులుగా పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతి వార్ ను తలపిస్తూ దసరాకు జరగబోతున్న జూనియర్ మహేష్ ల వార్ పై వందల కోట్ల స్థాయిలో భారీ బిజినెస్ జరగడంతో ఈ దసరా వార్ రిజల్ట్ పై చాలామంది గంపెడు ఆశలు పెట్టుకున్నారు..