
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అభిమానులకు క్లాస్ తీసుకున్నారు. అంత పెద్ద తప్పు అభిమానులు ఏమి చేసారా.. అని అనుకుంటున్నారా.. అది తిడుతూ తీసుకున్న క్లాస్ కాదండి.. ఆరోగ్యానికి సంబంధించి.
అసలు విషయానికి వస్తే.. ఉపాసన ఇటీవల ఒక వీడియో పోస్టు చేశారు. అభిమానులను బాగా ఆకట్టుకంటున్న ఆ వీడియోలో రామ్ చరణ్ తన కుక్కపిల్లలతో కలిసి వాకింగ్ చేస్తూ కనిపించారు.ఈ వీడియో ద్వారా అభిమానులకు హెల్తీ లైఫ్ స్టైల్ గురించి బోధించే ప్రయత్నం చేశారు ఉపాసన.
ఉపాసన తన భర్తను ముద్దుగా మిస్టర్ సి అని పిలుస్తుందనే విషయం తెలిసిందే. టీచర్స్ డే సందర్భంగా ఉపాసన ఈ పోస్టు చేశారు. రామ్ చరణ్ నుండి అభిమానులు నేర్చుకోవాల్సిన అంశాలను ప్రస్తావించారు. ఈ వీడియో పోస్టు చేసిన ఆమె.... ‘మిస్టర్ సి తనకు ఇష్టమైన వాటితో నడచివెళ్తున్నారు. హెల్తీ లైఫ్ స్టైల్‌కు కావాల్సిన లక్ష్యాలను మనకు నేర్పుతున్నారు. మన జీవనశైలిలో బద్ధకంగా ఉండటం ఓ వ్యాధి లాంటిదే. కాబట్టి, నడవండి' అని ఆమె పోస్టు చేశారు.
రామ్ చరణ్‌ను పెళ్లాడిన సమయంలో కాస్త లావుగా ఉన్న ఉపాసన... తర్వాత చాలా మారింది. చెర్రీని చూసి ఇనిస్పైర్ అయి ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అపోలో ఆసుపత్రి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన.... ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తోంది. ఫిట్‌నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో రోజూ శిక్షణ తీసుకుంటోంది.
ఉపాసన సోషల్ మీడయా ద్వారా యాక్టివ్‍గా ఉంటూ తనకు, చెర్రీకి సంబంధించి ముఖ్య విషయాలను అభిమానులతో పంచుకుంటూ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మోటివేట్ చేస్తున్నారు.