
ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేసిన మహేశ్‌బాబు స్పైడర్ రిలీజ్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం నుంచి ‘స్పైడర్’ను ఎప్పుడు విడుదల చేస్తారోనని వెయిట్ చేస్తున్న మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. మహేశ్ బర్త్‌డే(ఆగస్టు 9) కానుకగా ఆగస్టు సెకండ్ వీక్‌లో స్పైడర్ విడుదల చేయాలనుకుంటున్నారనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే అభిమానులారా చిన్న ఛేంజ్! చిత్రనిర్మాతలు ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు ‘స్పైడర్’ను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.
కారణం ఏంటంటే... ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీతో క్లైమాక్స్ షెడ్యూల్ ముగుస్తుంది. తర్వాత బ్యాలెన్స్ రెండు సాంగ్స్ షూట్ చేయడం కోసం ఫారిన్ వెళతారు. షూటింగ్ ఫాస్ట్‌గా పూర్తయినా... పోస్ట్ ప్రొడక్షన్ అండ్ గ్రాఫిక్ వర్క్స్‌కి ఎక్కువ టైమ్ కావాలని దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ అడిగారట! అదీ మేటర్. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త.
మొత్తానికి మహేష్ బాబు స్పైడర్ గా నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ బాహుబలి రిలీజ్ తో పెరిగిపోయిందని... సీన్స్ అన్నీ రీషూట్ చేసి తెలుగు ఆడియెన్స్ ప్రస్థుతం కోరుకుంటున్న స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా... భారీ రేంజ్ లో తెరకెక్కించి.. అన్నీ పర్ ఫెక్ట్ గా కుదదిరాకనే.. స్పైడర్ రిలీజ్ చేయాలని మహేష్ బాబు అండ్ టీమ్ ప్లాన్ చేస్తతుంటంతో.. రిలీజ్ కోసం సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ సెప్టెంబర్ దాకా వెయిట్ చేసే ఓపిక లేక మురుగదాస్ ను మాత్రం సోషల్ మీడియాలో ఒకక రేంజ్ లో ఆడుకుంటున్నారు.