ఏడాదికి ఒక్క సినిమా చేస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu). ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆరాటంతో ఎదురు చూస్తుంటారు. 2021 లో సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కానేలేదు. 2022 కోసం సెట్ చేసిన సర్కారువారి పాట(Sarkaru Vaari Paata )కు మాత్రం వరుస దెబ్బలు తగులుతున్నాయి.
ఏడాదికి ఒక్క సినిమా చేస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu). ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆరాటంతో ఎదురు చూస్తుంటారు. 2021 లో సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కానేలేదు. 2022 కోసం సెట్ చేసిన సర్కారువారి పాట(Sarkaru Vaari Paata )కు మాత్రం వరుస దెబ్బలు తగులుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)సర్కారువారి పాట(Sarkaru Vaari Paata) సినిమాకు ఇబ్బందులు తప్పడం లేదు. 2020లో కరోనా టైమ్ లో కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్.. 2021 లో మాత్ర అదే కరోనావల్ల సినిమాను తీసుకురాలేక పోయారు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్.. లాస్ట్ ఇయర్ ఫ్యాన్స్ ను నిరాశపరిచారు. ఇక ఈ ఏడాది సర్కారువారి పాట సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
గీతగోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ లో సూపర్ ఫాస్ట్ గానే సాగింది. ఆతరువాత వరుసగా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. మేజర్ షూట్ కంప్లీట్ అయినా.. ఇంకా 40 శాతం వరకూ షూటింగ్ పెడ్డింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ షూట్ ఎలాగైనా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని ట్రై చేస్తున్నారు మేకర్స్. దీనికోసం ఎన్ని ప్లాన్స్ చేసుకున్నా చివరికి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది.
ముందు సర్కారువారి పాట(Sarkaru Vaari Paata) రిలీజ్ 2022 సంక్రాంతికి అన్నారు. జనవరి 12ను లాక్ చేసుకున్నారు. కాని ట్రిపులు ఆర్(RRR) రిలీజ్ సంక్రాంతికి అని హింట్ రాగానే.. రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 1కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఆ డేట్ కు కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టం అనే అంటున్నారు. వరుసగా షూటింగ్స్ కు బ్రేక్స్ రావడంతో.. ఇంకా టైమ్ పట్టొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సర్కారువారి పాట(Sarkaru Vaari Paata) ఏప్రిల్ నుంచి అగస్ట్ కు మారుతుంది అనే టాక్ గట్టిగా నడుస్తుంది.
ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో చేసుకున్న టీమ్ తరువాతి షెడ్యూల్ ను హైదరాబద్ లోనే కంప్లీట్ చేసుకున్నారు. కరోనా వల్ల గ్యాప్ తీసుకుని మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసినా.. ఆతరువాత రీసెంట్ గా మహేష్(Mahesh Babu) కాలికి సర్జరీ జరిగింది. కోలుకున్నారు.. సంక్రాంతి తరువాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైమ్ కు మహేష్ కు కరోనా వచ్చింది. ఇవి చాలవు అన్నట్టు.. కరెక్ట్ గా ఇదే టైమ్ లో మహేష్ బాబు(Mahesh Babu) అన్న రమేష్ బాబు(Ramesh Babu) సడెన్ గా మరణించారు. దాంతో ఇప్పట్లో సూపర్ స్టార్ సెట్స్ ఎక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది.
వీటన్నింటి నుంచి మహేష్(Mahesh Babu) సెట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. అది వచ్చే నెలా.. లేక ఆతరువాతనా అనేది చెప్పలేం. అందకే.. రిలీజ్ డేట్ పై ఇఫ్పుడే ఒక మాట అనుకుంటే సరిపోతుంది అని లోచిస్తున్నారట మేకర్స్. ఏప్రిల్ 1 రిలీజ్ కష్టమౌతుంది.. అందుకే ఆగస్ట్ కు వెళ్ళిపోదాం అని.. మేజారిటీ టీమ్ భావిస్తున్నట్టు టాక్. ఈలెక్కన సర్కారువారి పాట(Sarkaru Vaari Paata) ఇది మూడోసారి వాయిదా అవుతుంది. అయితే అఫీషియల్ గా మాత్రం టీమ్ ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : Naga Chaitanya:ఏపీ టిక్కెట్ రేటుపై చైతూ..ఇలా అంటాడని అసలు ఊహించం
పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న సర్కారువారి పాట(Sarkaru Vaari Paata)సినిమాను మహేష్ బాబు(Mahesh Babu)తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలకు సంబంధించిన కథతో రూపొందింది సర్కారువారి పాట సినిమా. ఈ మూవీలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు.
Also Read : Megastar Chiranjeevi: 22 ఏళ్ళ తరువాత మరోసారి తెరపైకి ‘అన్నయ్య’ కాంబినేషన్.