Megastar Chiranjeevi: 22 ఏళ్ళ తరువాత మరోసారి తెరపైకి ‘అన్నయ్య’ కాంబినేషన్.

By Mahesh Jujjuri  |  First Published Jan 13, 2022, 6:56 AM IST

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). తగ్గేదే లే అంటున్నారు మెగాస్టార్. ఈ మధ్య చేస్తన్న సినిమాల్లో చిరంజీవితో పాటు రేర్ కాంబినేషన్స్ పై దృష్టిపెట్టారు. అందులో భాగంగా మరో రేర్ కాంబో కలవబోతోంది.  


వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). తగ్గేదే లే అంటున్నారు మెగాస్టార్. ఈ మధ్య చేస్తన్న సినిమాల్లో చిరంజీవితో పాటు రేర్ కాంబినేషన్స్ పై దృష్టిపెట్టారు. అందులో భాగంగా మరో రేర్ కాంబో కలవబోతోంది.  

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) దగదడలాడిస్తున్నాడు. యంగ్ స్టార్స్ కంటే ఎక్కువగా స్పీడ్ చూపిస్తున్నారు. వరుస సినిమాలను లైన్ అప్ చేస్తున్నారు మెగాస్టార్స్. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్ లో నటించిన ఆచార్య(Acharya) రిలీజ్ కు రెడీగా ఉంది. ఇందులో రామ్ చరణ్(Ram Charan) ని కూడా తన తో స్క్రీన్ శేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన మెగాస్టార్.. ఆతరువాతి సినిమాల్లో కూడా.. తనతో పాటు ఏదో ఒక స్టార్ కు స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు.

Latest Videos

ఇక మెగాస్టార్ ఆచార్య(Acharya)  తరువాత మలాయళ మూవీ లూసీఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ చేస్తున్నారు. మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దీనితో పాటు మోహార్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్(Bhola Shankar) చేస్తున్న చిరంజీవి.. బాబీ(Boby) డైరెక్షన్ లో మరో మూవీ కమిట్ అయ్యారు. రీసెంట్ గా వెంకీ కుడుములాతో కూడా మూవీ అనౌన్స్ చేశారు చిరు. బాబీతో చేయబోతున్న సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టు అంటున్నారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్  చిరంజీవికి(Megastar Chiranjeevi) తమ్ముడుగా.. మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) స్క్రీన్ శేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో మాస్ హరో జాయిన్ అయితే.. బాక్సాఫీస్ బద్దలవుతుంది. అందుకే ఈ కాంబినేషన్ ను ఎలాగైనా కలపాలని డైరెక్టర్ బాబీ విశ్వప్రయత్నం చేస్తున్నాడట. అయితే వీరి కాంబినేషన్ లో 22 ఏళ్ల క్రితం సినిమా వచ్చింది. 2000 లొ అన్న సినిమాలో రవితేజ చిరంజీవి తమ్ముడగిగా నటించారు. మరో తమ్ముడిగా వెంకట్ కూడా నటించారు.

అన్నదమ్ముల సెంటిమెంట్ తో తెరకెక్కిన అన్నయ్య సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆ హిట్ కాంబినేషన్ లో మరోసారి సెట్ చేయాలి అని చూస్తున్నారు మేకర్స్. పైగా ఇప్పుడు రవితేజ (Ravi Teja) ఇమేజ్ వేరు. గతంలో క్యారెక్టర్ రోల్స్ చేసినా.. ఇప్పుడు ఆయన స్టార్ హీరో. ఈ టైమ్ లో కనుక మెగాస్టార్.. మాస్ మహారాజ్ కాంబినేషన్ లో మూవీ వస్తే.. బాక్సాఫీస్ పగిలపోతుందంటున్నారు మేకర్స్. దీనికి చిరంజీవి కూడా సుముఖంగానే ఉన్నారని సమాచారం. రవితేజ కూడాదాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని చెపుతున్నారు.

వాల్తేరు వీరయ్యగా బాబీ సినిమాలో చిరంజీవి(Megastar Chiranjeevi)  పక్కా మాస్ క్యారెక్టర్ తో పాటు.. పోలీస్ అండర్ కవర్ ఆఫీసర్ గా మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో 40 నిమిషాల నిడివితో రవితేజ పాత్ర ఉంటుందని సమాచారం. పక్కా మాస్ స్టోరీతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకోసం బాబీ అన్నీ రెడీ చేసుకున్నారు. ఇక రవితేజ(Ravi Teja)  విషయంతో పాటు.. సినిమా టైటిల్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం ఒక్కటే మిగిలుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే కలుస్తుందా.. లేదా..? అనేది చూడాలి.

Also Read :`ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా పడ్డందుకు బాధ లేదన్న రామ్‌చరణ్‌.. అనుపమా డాన్సుకి ఫిదా

click me!