Lata Mangeshkar Death: ఓపీ నయ్యర్‌ సినిమాలో ఒక్క పాట కూడా పాడని లతా మంగేష్కర్‌.. కారణాలు హాట్‌ టాపిక్‌

Published : Feb 06, 2022, 10:44 AM IST
Lata Mangeshkar Death: ఓపీ నయ్యర్‌ సినిమాలో ఒక్క పాట కూడా పాడని లతా మంగేష్కర్‌.. కారణాలు హాట్‌ టాపిక్‌

సారాంశం

 లతా మంగేష్కర్‌ తన ఏడు దశాబ్దాల సినీ కెరీర్‌లో యాభైవేలకుపైగా పాటలు ఆలపించారు. దాదాపు అందరు సంగీత దర్శకులతో పనిచేశారు. ఒక్కో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో వేల పాటలు పాడారు. కానీ హిందీలో పాపులారిటీని పొందిన ఓపీ నయ్యర్‌(ఓం ప్రకాష్‌ నయ్యర్‌) సంగీత సారథ్యంలో మాత్రం ఆమె ఒక్క పాట కూడా పాడలేదు.

గాన శిఖరం నెలకొరిగింది. అద్భుతమైన గాత్రంతో ఇండియన్‌ ఆడియెన్స్ ని ఒలలాడించిన లతా మంగేష్కర్‌(Lata Mangeshkar Death) కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆమె కరోనాతో పోరాడుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్రోతల హృదయాలను బద్దలు చేస్తూ ఆమె అనంత శిఖరాలకు వెళ్లిపోయారు. మన మధ్య నుంచి అస్తమించారు. సినీ సంగీతాన్ని శోకసంద్రంలో ముంచెత్తారు. తను విశ్రాంతి తీసుకుంటున్నారు. 

`తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె చీకట్లో..` ఈ పాట తెలీని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ గానమాధుర్యానికి పరవశించిపోని శ్రోతలూ ఉండరు. అయితే, ఆ పాట పాడిన గాయని ఉత్తరాది గాయని. ఈ విషయమూ అందరికీ తెలిసిందే. కానీ, ఆమె తెలుగులో పాడింది ముత్యాల్లాంటి మూడే పాటలు. ఇది మూడోది. మొదటి రెండు పాటలూ ఈ తరానికి అసలు తెలిసే అవకాశం ఉండదు. 

1929 సెప్టెంబర్‌ 28న లతా మంగేష్కర్‌ ఇండోర్‌లో జన్మించారు. పలు భాషలలో పాటలు పాడారు. లతా మంగేష్కర్‌ 1942 నుంచి తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 1000 కి పైగా హిందీ చిత్రాలలో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె తండ్రి దిననాథ్‌ మంగేష్కర్‌ శాస్త్రీయ గాయకులు, నాటక కళాకారులు. ఆయన అడుగజాడలలో నడచిన లతా మంగేష్కర్‌ మంచి గాయకురాలిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.లతా మంగేష్కర్‌ ఇప్పటికే జాతీయ చలనచిత్ర అవార్డు, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు.

ఇదిలా ఉంటే లతా మంగేష్కర్‌ తన ఏడు దశాబ్దాల సినీ కెరీర్‌లో యాభైవేలకుపైగా పాటలు ఆలపించారు. దాదాపు అందరు సంగీత దర్శకులతో పనిచేశారు. ఒక్కో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో వేల పాటలు పాడారు. కానీ హిందీలో పాపులారిటీని పొందిన ఓపీ నయ్యర్‌(ఓం ప్రకాష్‌ నయ్యర్‌) సంగీత సారథ్యంలో మాత్రం ఆమె ఒక్క పాట కూడా పాడలేదు. ఇది ఇప్పటికే అంతుచిక్కని విషయంగా ఉంది. మరి ఓపీ నయ్యర్‌తో, లతా మంగేష్కర్‌కి మధ్య గొడవేంటి? ఎందుకు ఆమె పాడలేదు, ఎందుకు లతాతో తన సినిమాల్లో పాడించలేదనేది సస్పెన్స్ గా మారింది. 

అయితే ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ ఆశా భోంస్లే వెల్లడించారు. అసలు విషయం బయటపెట్టారు. లతా మంగేష్కర్, ఓపీ నయ్యర్ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఓ ఇంటర్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. లతా అంటే ఓపీ నయ్యర్‌కి ఎంతో అభిమానం అని తెలిపారు. అయితే ఆమె ఎదుగుదలని ఆయన సంతోషిస్తారని, మంచి కోరుకునే వ్యక్తి అని తెలిపింది. 

మరి ఎందుకు తన సంగీత సారథ్యంలో పాడించలేదనే దానికి ఆశా భోంస్లే స్పందిస్తూ, సింగర్‌గా లతా అంటే ఇష్టమని, కానీ ఆమె గాత్రం ఓపీ నయ్యర్‌కి నచ్చలేదని, ఆమె గొంతుని ఆయన ఇష్టపడడని, అందుకే ఆమె చేత పాడించలేదని తెలిపింది. అయితే ఈ విషయంలో లతా మంగేష్కర్‌ కూడా పెద్దగా పట్టింపులకు పోలేదని, ఆయన నిర్ణయాన్ని గౌరవించిందని, తను కూడా ఆయన సారథ్యంలో పాడలని ఎప్పుడూ ఒత్తిడి తేలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే ఆశాభోంస్లేని ఓపీ నయ్యర్‌ ఎంతగానో ఎంకరేజ్‌ చేశారు. ఆమో టాప్‌ సింగర్‌గా ఎదగడంలో ఆయన సంగీత సారథ్యంలోని పాటలు కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా