టైమ్‌ స్క్వైర్‌నే వెలిగిస్తున్నావ్‌.. కూతురు సితారపై మహేష్‌ ఎమోషనల్‌ పోస్ట్.. వైరల్‌

Published : Jul 04, 2023, 07:54 PM ISTUpdated : Jul 04, 2023, 09:00 PM IST
టైమ్‌ స్క్వైర్‌నే వెలిగిస్తున్నావ్‌..  కూతురు సితారపై మహేష్‌ ఎమోషనల్‌ పోస్ట్.. వైరల్‌

సారాంశం

మహేష్‌ కూతురు సితార నటించిన జ్యువెల్లరీ యాడ్‌ని అమెరికాలోని టైమ్‌ స్క్వైర్‌పై ప్రదర్శించారు. దీంతో మహేష్‌ ఆనందంతో ఉప్పొంగిపోయారు. తాజాగా ఆయన ఎమోషనల్‌ గా స్పందించారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, నమ్రత ల ముద్దుల తనయ, చిచ్చర పిడుగు సితార. చిన్నప్పుడే అనేక రేర్‌ ఫీట్స్ సొంతం చేసుకుంటుంది. ఆమె సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. డాన్సులతో ఇరగదీస్తుంది. ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా భావించి టైమ్‌ స్వ్కైర్‌పైకి ఎక్కింది. అమెరికాలోని టైమ్‌ స్క్వైర్‌పై ఆమె చిత్రాలు ప్రదర్శించడం విశేషం. 

సితార ప్రముఖ జ్యువెల్లరీ యాడ్‌లో నటించింది. అందంగా ముస్తాబై నగలు పెట్టుకుని, శారీ కట్టుకుని పోజులిచ్చింది. రంగురంగుల శారీ, వివిధ రకాల డిజైన్‌తో కూడిన నగలు ధరించి ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. సితారపై ప్రముఖ నగల సంస్థ వీడియోని షూట్‌ చేసింది. దాన్ని టైమ్‌ స్క్వైర్‌లో దీన్ని ప్రదర్శించారు. దీన్ని సితార తల్లి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు(మంగళవారం) ఈ యాడ్‌ని ప్రదర్శించడం విశేషం.

ఇక తన కూతురు ఇంతటి ఘనతసాధించడంపై మహేష్‌బాబు స్పందించారు. తన ఆనందాన్ని పంచుకుంటూ ఆయన కూతురుపై ప్రశంసలు కురిపించారు. సితార విజువల్స్ ని ఆయన షేర్‌ చేస్తూ, టైమ్‌ స్క్వైర్‌నే వెలిగిస్తున్నావు, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలానే కొనసాగించు` అని పేర్కొన్నారు మహేష్‌. మరోవైపు సితార సైతం తన ఫోటోలను పంచుకుంటూ, టైమ్స్ స్వ్కైర్‌పై తనని తాను చూసుకుని గట్టిగా అరిచినట్టు, చాలా ఎమోషనల్‌ కి గురై కంటతడి పెట్టినట్టు చెప్పింది సితార. 

దీంతో సితారపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘనత సాధించిన తొలి స్టార్‌ కిడ్‌ సితార అని, చిన్న వయసులో ఇంత పెద్ద ఘనత సాధించిందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. సితార ఇటీవల `సర్కారు వారిపాట` చిత్రంలో ప్రమోషనల్‌ సాంగ్‌లో డాన్సు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్‌ `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?