‘గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది’.. అల్లు అర్జున్ డైలాగ్ తో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నీలకంఠ

By Asianet News  |  First Published Jul 4, 2023, 6:56 PM IST

నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు నీలకంఠ (Neelakanta)  చాలా కాలం తర్వాత ‘సర్కిల్’ అనే సినిమాతో రాబోతున్నాడు. అయితే ఇంత గ్యాప్ పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. 


తొమ్మిదేళ్ల తర్వాత నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు నీలకంఠ ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన కేరీర్ లో చేసినవి కొన్ని సినిమాలే అయినా అందరికీ గుర్తుండిపోయేలా చేశారు. నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘షో’, ’మిస్మమ్మ’, ‘విరోధి’, ‘సదా మీ సేవలో’, ‘మాయ‘, ‘జూమ్ జూమ్’ వంటి సినిమాలు వచ్చాయి. 2014లో చివరి చిత్రం వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి సినిమా రాలేదు.

ఇంత గ్యాప్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నారు. ఇన్నేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చిందో తాజాగా క్లారిటీ ఇచ్చారు. మాయ సినిమా తరువాత రెండు ప్రాజెక్ట్‌లకు సైన్ చేశా. అయితే అనుకోని కారణాలతో అవి ఆగిపోయాయి. మాయ మూవీని హిందీలో తీయాలని మహేష్ భట్ గారు అడిగారు. లాస్ట్ మినిట్‌లో అది ఆగిపోయింది.  మరో రెండు సినిమాలు దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. ఆ తరువాత ఓ మలయాళం సినిమా తీశా. అలా ’గ్యాప్ వచ్చింది... తీసుకోలేదు’ అని క్లారిటీ ఇచ్చారు. 

Latest Videos

undefined

ఇక నీలకంఠ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కిల్’. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా  ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త  థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న ఆడియన్స్ ముందుకు రానుంది. 

మూవీకి సినిమాటోగ్రపీగా రంగనాథ్ గోగినేని, ఎడిటర్ గా మధు రెడ్డి వర్క్ చేస్తున్నారు. ఎన్.ఎస్ ప్రశు సంగీతం అందిస్తున్నారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

సినిమా గురించి, తనప్రాజెక్ట్స్ గురించి నీలకంఠ మాట్లాడూతూ.. మరిన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.  "మాయ సినిమా తరువాత తొమ్మిదేళ్ల గ్యాప్ అనంతరం తెలుగులో సినిమా తీస్తున్నా.. తెలుగులో మళ్లీ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఫేట్ (విధి) అనే కాన్సెప్ట్ ఓ వందమందిని  ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి.. ఎట్లా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందని మెయిన్ థీమ్‌గా తీసుకున్నాం. ఇది రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ కాదు. ఇన్వెస్టిగేషనల్ టైప్‌లో కాకుండా.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రన్ చేశాం.

సాయి రోనక్ ఫొటో గ్రాఫర్‌గా కనిపిస్తాడు. అన్‌హ్యూమన్ సర్కిల్‌లోకి అతన్ని ఎలా లాగబడ్డాడు..? అక్కడి నుంచి కథ రివీల్ అవుతుంది. రొమాంటిక్ యాంగిల్ కూడా జత చేశాం. ముగ్గురు హీరోయిన్లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. నా గత సినిమాల్లో మాదిరే హీరోయిన్స్‌కు ఈ మూవీలో కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. ముగ్గురు హీరోయిన్లు మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సినిమాలో వాళ్ల లైఫ్‌ను వాళ్లే డిసైడ్ చేసుకుని ముందుకు సాగుతారు.  బాబా భాస్కర్ గారి క్యారెక్టర్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. నా సినిమాలు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. నా మూవీస్ అన్ని క్రిటికల్‌గా రన్ అయ్యాయి. నేను స్టార్ హీరోలతో చేయాలని కాదు.. కాన్సెప్ట్‌ మీదే ఎక్కువగా వర్క్ చేశా. త్వరలో కుదిరితే స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తా. 

వెంకటేష్ తో స్వామి వివేకానంద సిరీస్‌ ప్లాన్ చేశాం. అయితే అది టేకాఫ్ కాలేదు. ఆ తరువాత వెంకటేష్‌ గారితో ఈనాడుకు కలిసి పనిచేశా. వివేకానంద సిరీస్‌ చేయాలని వెంకటేష్ గారు చాలా ఆసక్తిగా ఉండేవారు. అప్పుడ టీవీ సిరీస్‌కు తీయాలని ప్లాన్ చేశాం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. నాకు అవార్డు గురించి ఆలోచన లేదు. సినిమా మంచి సక్సెస్ అయి.. ఆడియన్స్ మెచ్చుకుంటే అదే నాకు పెద్ద అవార్డు. మనం సినిమా తీసి థియేటర్‌కు వెళితే.. అక్కడ జనాలు ఇచ్చే అభినందలు చెప్పలేని ఆనందాన్ని ఇస్తాయి.

ఈ సినిమాలో కాన్సెప్ట్‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా చూపించాం. ఆడియన్స్ చూసే విధానంలో మార్పు వచ్చింది. కొత్తగా తీసిన సినిమాలను తప్పకుండా ఆదరిస్తున్నారు. మా సినిమాను కూడా కచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది. ఈ సినిమా తరువాత వెబ్‌సిరీస్ చేయాలని ఆసక్తి ఉంది. రెండు కాన్సెప్ట్‌లు రెడీగా ఉన్నాయి.

click me!