మహేష్ ఫ్యామిలీని బాధపెట్టే సంఘటన.. కంటతడి పెట్టుకున్న సితార, ఏం జరిగిందంటే

Published : Aug 17, 2023, 05:08 PM IST
మహేష్ ఫ్యామిలీని బాధపెట్టే సంఘటన.. కంటతడి పెట్టుకున్న సితార, ఏం జరిగిందంటే

సారాంశం

మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో మహేష్ కుటుంబ సభ్యులంతా కలత చెందారు. ముఖ్యంగా చిన్నారి సితార మనసుని బాధపెట్టే సంఘటన ఇది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక మహేష్.. రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్ధం అవుతారు. ఈ చిత్రానికి సంబంధించిన కసరత్తు ఆల్రెడీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో మహేష్ కుటుంబ సభ్యులంతా కలత చెందారు. ముఖ్యంగా చిన్నారి సితార మనసుని బాధపెట్టే సంఘటన ఇది. సితార అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన పెట్ (కుక్క) ప్లూటో మరణించింది. ఏడేళ్లుగా తనకి తోడుగా ఉన్న ఫ్లూటో మరణించడంతో సితార కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

దీనితో విషాదంలో మునిగిపోయిన సితార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నేను నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా. 7 ఏళ్ళు ఎంతో అద్భుతంగా గడిచాయి అంటూ సితార కామెంట్ పెట్టింది. సితార పోస్ట్ కి నమ్రత స్పందిస్తూ.. ఫ్లూటో మన హృదయాల్లో ఎప్పటికీ ఉంటుంది అని తెలిపింది. మహేష్ అభిమానులంతా సితారని ఓదార్చుతూ కామెంట్స్ పెడుతున్నారు. 

సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి జీవితాల్లో పెట్స్ భాగం అయ్యాయి. ప్రతి ఇంట్లో పెంపుడు కుక్క ఉండడం సహజమే. అయితే సెలెబ్రిటీలు అందమైన పెట్స్ ని ఏరికోరి అధిక మొత్తంలో డబ్బు వెచ్చించి సొంతం చేసుకుంటుంటారు. ప్రేమగా ముద్దుగా చూసుకునే పెట్స్ దూరం అయితే తప్పకుండా మనసుకు బాధగానే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. సితార ఈ బాధ నుంచి త్వరగా బయట పడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

ఇదిలా ఉండగా సితార తనకి చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల తెలిపింది. ఇండస్ట్రీలో నటిగా రాణిస్తానని తెలిపింది. ఆ మధ్యనే సితార తన తొలి యాడ్ షూట్ కూడా పూర్తి చేసింది. సర్కారు వారి పాట చిత్రంలో సితార పెన్నీ సాంగ్ కి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే