'ఎఫ్ 2' సినిమాపై మహేష్ బాబు కామెంట్స్!

Published : Jan 13, 2019, 03:12 PM IST
'ఎఫ్ 2' సినిమాపై మహేష్ బాబు కామెంట్స్!

సారాంశం

ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ సినిమా విడుదలవుతున్నా చూసి మరీ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. 

ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ సినిమా విడుదలవుతున్నా చూసి మరీ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా 'ఎఫ్ 2' సినిమా చూసిన మహేష్ బాబు సినిమా చాలా బాగుందని, ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశారు. ''ఎఫ్ 2 సినిమా చూశాను. పూర్తి వినోదాత్మక చిత్రం.. చాలా ఎంజాయ్ చేశాను. వెంకీ సర్ తన పాత్రలో అధ్బుతంగా ఒదిగిపోయారు. అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. వరుణ్ తేజ్ పాత్ర కూడా సరదాగా ఉంటుంది. వెంకీ సర్ టైమింగ్ కి వరుణ్ సరిగ్గా సరిపోయారు'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు.

అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ ని దక్కించుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మేహ్రీన్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మొదటిరోజే మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు నాలుగు కోట్ల షేర్ ని తీసుకొచ్చింది.  

 

 

'ఎఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఫన్ .. సంక్రాంతి విన్ (ఎఫ్‌2 రివ్యూ)

ప్రీమియర్ షో టాక్: F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) 

'ఎఫ్ 2' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌