
తెలుగు, తమిళ బాషల్లో మహేష్ , మురుగదాస్ మూవీ భారీ ఎత్తున తెరకెక్కుతోంది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్ చేస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి సారి మహేష్ కోలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. స్టాలిన్ తర్వాత మురుగదాస్ తెలుగు హీరోతో స్ట్రెయిట్ గా మూవీ చేస్తున్నాడు. సోషల్ ఇష్యూస్ పై మురుగదాస్ సంధించే మరో అస్త్రంగా ఈ చిత్రాన్ని చెప్పుకొస్తున్నారు.
ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దర్శకుడు చాలా సీక్రెట్ గా మెయిన్ టేన్ చేస్తున్నాడు. ఇంత వరకు ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఏవి బయటికి రాలేదు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రిన్స్ కొత్తగా కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. స్టైలిష్ ఇంటిలిజెన్స్ అఫీసర్ గా కనిపిస్తాడట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
డిసెంబర్ వరకు సాగే షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం ముగియనుంది. సమ్మర్ కి రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26న విడుదల చేయాలనుకుంటున్నారట చిత్ర యూనిట్. ఈ సినిమాకు అభిమణ్యుడు అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారంలో ఉంది. అదే టైటిల్ పెడతారా లేక కొత్త టైటిల్ అనౌన్స్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.సైనికుడు చిత్రం తర్వాత హరీష్ జయరాజ్ మహేష్ కి మ్యూజిక్ అందిస్తున్న చిత్రమిదే.