మహేష్‌ బాబు ఊరమాస్‌ లుక్‌.. `గుంటూరు కారం` నుంచి కొత్త పోస్టర్‌.. బర్త్ డే ట్రీట్‌ ఇదే!

Published : Aug 09, 2023, 06:42 AM IST
మహేష్‌ బాబు ఊరమాస్‌ లుక్‌.. `గుంటూరు కారం` నుంచి కొత్త పోస్టర్‌.. బర్త్ డే ట్రీట్‌ ఇదే!

సారాంశం

ఈనేపథ్యంలో వారిని ఖుషి చేసే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది యూనిట్. నేడు ఆగస్ట్ 9న మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా `గుంటూరు కారం` చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న చిత్రమిది. దాదాపు 13ఏళ్ల తర్వాత మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండటంతో ఇటీవల ఆ అంచనాలు మరింత పెరిగాయి. హారికా అండ్‌ హాసిని ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చివరికి సినిమా ఉంటుందా? లేదా? అనే చర్చ కూడా జరిగింది. 

దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. ఈనేపథ్యంలో వారిని ఖుషి చేసే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది యూనిట్. నేడు ఆగస్ట్ 9న మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా `గుంటూరు కారం` చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఓ ఆఫీస్‌లో టేబుల్‌పై కూర్చొని సిగరేట్‌ వెలిగించుకుంటున్నట్టుగా ఉన్న మహేష్‌ కొత్త లుక్‌ అదిరిపోయింది. ఊర మాస్‌గా ఉంది. ఇందులో మహేష్‌ లుంగీ కట్టుకుని ఉన్నాడు. ఇంత మాస్‌ లుక్‌లోనూ మహేష్‌ స్టయిలీష్‌ గ్లాసెస్ పెట్టుకోవడం విశేషం.

 ఇది మాస్‌ మొగుడిలా ఉందని అంటున్నారు ఫ్యాన్స్. వాళ్లు ఈ కొత్త లుక్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ బర్త్ డేకి ఇది చాలు అనేలా ఈ కొత్త పోస్టర్‌ ఉండటం విశేషం. ఇందులో అనేక రూమర్స్ కి చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది యూనిట్‌. రిలీజ్‌ డేట్‌ని మరోసారి కన్ఫమ్‌ చేసింది. జనవరి 12న రాబోతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. షూటింగ్‌ సరిగా జరగని నేపథ్యంలో విడుదల తేదీ వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ విషయంపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. 

అయితే నిజానికి మహేష్‌ బర్త్ డేకి ముందుగా ఓ సాంగ్‌ని విడుదల చేయాలని భావించారు. థమన్‌ ఓ ట్యూన్‌ కూడా రెడీ చేశారు. ప్రోమోలతో సహా అన్నీ సిద్ధం చేశారు. మహేష్‌ బాబుకి ఈ ట్యూన్‌ని పంపించగా, ట్యూన్‌ నచ్చలేదని, కొత్త ట్యూన్‌ చేయమని చెప్పాడట. ఇప్పటికిప్పుడు తన వల్ల కాదని, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ లైట్‌ తీసుకున్నారట. దీంతో చేసేదేం లేక సాంగ్‌ రిలీజ్‌ ఆలోచన విరమించుకుని జస్ట్ పోస్టర్‌తో సరిపెట్టుకున్నారు. 

ఈ సినిమా విషయంలో మొదట్నుంచి త్రివిక్రమ్‌ వర్క్ పై, ఆయన టెక్నీషియన్ల వర్క్ పై మహేష్‌ అసహనంతో ఉన్నారట. ఔట్‌పుట్‌ సరిగా రావడం లేదని ఆయన అసంతృప్తి చెందుతున్నారని వార్తలొస్తున్నాయి. మొదట్లో ఫైట్ సీక్వెన్స్ చేయగా, అవి నచ్చలేదన్నారట మహేష్‌. దీంతో వాటిని పక్కన పెట్టి టాక్ పార్ట్ షూట్‌ చేయాలని భావించారు త్రివిక్రమ్‌. కానీ చాలా మంది పెద్ద ఆర్టిస్టులుండటంతో వారి డేట్స్ సెట్‌ కాక షూటింగ్‌ డిలే అవుతూ వస్తోంది. చివరికి ఇటీవల కొంత టాకీ పార్ట్ ని పూర్తి చేసినట్టు సమాచారం. అయినా త్రివిక్రమ్‌ విషయంలో మహేష్‌ గుర్రుగా ఉన్నారని, ఇద్దరికి పడటం లేదని సమాచారం. 

ముఖ్యంగా త్రివిక్రమ్‌ ఇతర ప్రాజెక్ట్ లకు పనిచేస్తూ, తమ సినిమాపై ఫోకస్‌ పెట్టడం లేదని మహేష్‌ వైపు నుంచి ఆరోపణగా వినిపిస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా అనే విషయంలోనూ మహేష్‌ అభ్యంతరం తెలిపారట. దీంతో ఆమెని పక్కన పెట్టారు. సెకండ్‌ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలని మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గా చేశారని, సెకండ్‌ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది. దీంతో వెంటనే మహేష్‌ ఫ్యామిలీతో కలిసి లండన్‌ టూర్‌ వెళ్లారు. అక్కడ కొన్ని పర్సనల్‌ వర్క్ కూడా కంప్లీట్‌ చేసుకునే పనిలో పడ్డారు. కుమారుడు గౌతమ్‌ని లండన్‌లో చదివించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయన వచ్చాక మరో షెడ్యూల్‌ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆయన లేని సన్నివేశాలు ముందుగా తీసేందుకు త్రివిక్రమ్‌ సిద్ధమవుతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్