
సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మూవీస్‌లో ఒకటి `బిజినెస్ మేన్`. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ రిజల్ట్ ని చవి చూసింది. కానీ ఇప్పుడు రీ రిలీజ్ టైమ్‌కి దుమ్ములేపుంది. రేపు బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా `బిజినెస్ మేన్`ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. గత రికార్డులను బ్రేక్ చేస్తుంది.
ఈ సినిమా రేపు ఏకంగా సుమారు రెండు వేల థియేటర్లలో రిలీజ్ కాబోతుండటం విశేషం. అంతేకాదు.. ఇప్పటి వరకు అత్యధికంగా బుకింగ్స్ చేసుకున్న మూవీగా నిలిచింది. రీ రిలీజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ లో `బిజినెస్ మేన్` ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు, చెన్నైలో ఇది గత రికార్డులను బ్రేక్ చేసింది. ఇక హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే కోటిన్నర రావడం విశేషం. నైజాం ఏరియాలో ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతుందని చెప్పొచ్చు.
వీటితోపాటు అమలాపురం, గుంటూరు వంటి పలు ఏరియాల్లోనూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో టాప్‌లో ఉంది. దీంతో `బిజినెస్ మేన్` మొదటి రోజు గత సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు. ఇదివరకు `సింహాద్రి` మూవీ ఐదు కోట్ల గ్రాస్‌తో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత నాలుగు కోట్లతో `ఖుషి` ఉంది. వాటి రికార్డులను బ్రేక్ చేయాలని మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమా థియేటర్ల వద్ద చాలా చోట్ల మహేష్ బాబు కటౌట్‌లు పెట్టడం విశేషం. అందులో ప్రధానంగా హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్, విశ్వనాథ్ థియేటర్ల వద్ద కటౌట్లు వెలిశాయి. ఇది కూడా రికార్డుగానే చెప్పాలి. ఇలా చూడబోతుంటే `బిజినెస్ మేన్` చాలా రికార్డులనుబ్రేక్ చేయబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి పరిస్థితులు చాలా కలిసి వచ్చాయి. థియేటర్లలో బాగున్న సినిమా ఒక్కటి కూడా లేదు. పోటీగా ఏదీ లేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్, క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని చాలా వరకు థియేటర్లన్నీ `బిజినెస్ మేన్`కి ఇస్తున్నారు. అలా ఈ సినిమా భారీగా రిలీజ్ కాబోతుంది. ఓరకంగా దీనికి కాలం కలిసొస్తుందని చెప్పొచ్చు.
రేపు సూపర్ స్టార్ మహేష్‌బాబు తన 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో `బిజినెస్ మేన్`ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రీ రిలీజ్ మూవీస్ బాగా ఆడుతున్నాయి. మంచి కలెక్షన్లని సాధిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఆ మధ్య వచ్చిన `ఈ నగరానికి ఏమైంది` చిత్రం రిలీజ్ టైమ్‌లో కంటే రీ రిలీజ్ టైమ్‌లో ఎక్కువ కలెక్షన్లని సాధించడం విశేషం.