ఈ సారి రెండు గంటలపాటు శ్యాంబాబు.. పృథ్వీ కొత్త సినిమా.. ఇక రచ్చ నెక్ట్స్ లెవల్‌?

Published : Aug 08, 2023, 10:32 PM IST
ఈ సారి రెండు గంటలపాటు శ్యాంబాబు.. పృథ్వీ కొత్త సినిమా.. ఇక రచ్చ నెక్ట్స్ లెవల్‌?

సారాంశం

`బ్రో` సినిమాలో నిమిషం పాటు ఉన్న శ్యాంబాబు పాత్రకే ఏపీలో వైసీపీ నాయకులు నానా రచ్చ చేశారు. అదే ఆయన పాత్ర రెండు గంటలపాటు ఉంటే, ఇక దాన్ని ఊహించడం కష్టమే. 

`బ్రో` సినిమాలో నిమిషం పాటు ఉన్న `శ్యాంబాబు` పాత్రకే ఏపీలో వైసీపీ నాయకులు నానా రచ్చ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ని ఏకి పడేస్తున్నారు. `బ్రో` సినిమాని తూర్పార పట్టారు. డిజాస్టర్ అని కామెంట్లు చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు నానా రచ్చ చేశాడు. ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులంతా ప్రభుత్వ కార్యకలాపాలంటే `బ్రో` సినిమాని, పవన్‌ని విమర్శించడానికే ప్రయారిటీరి ఇచ్చారు. అంతగా రచ్చ చేసిందీ ఆయా సన్నివేశం. 

అదే రెండుగంటల పాటు `శ్యాంబాబు` పాత్ర ఉంటే.. ఏపీ రాజకీయాలను ఊహించడమే కష్టంగా ఉంది. మరి అలాంటి పనికి, అలాంటి డేరింగ్‌కి రెడీ అవుతున్నారు నటుడు, కమెడియన్‌ 30 ఇయర్స్ పృథ్వీ. ఈ సారి తాను రెండు గంటల శ్యాంబాబు పాత్రతో రాబోతున్నానని తెలిపారు. ఓ వీడియోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు పృథ్వీ రాజ్‌. `శోభన్‌బాబు` పేరుతో ఓ సినిమా రూపొందుతుందని, అందులో తాను శ్యాంబాబుగా కనిపిస్తానని, ఆ పాత్ర రెండుగంటలపాటు ఉంటుందన్నారు. `బ్రో` సినిమాలో తన పాత్రని ఆదరించినట్టుగానే `శోభన్‌బాబు` సినిమాలోని తన శ్యాంబాబు పాత్రని ఆదరించాలని ఆయన వెల్లడించారు. 

అయితే ఆ సినిమాకి సంబంధించిన వివరాలు మాత్రం త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఆ సినిమాకి దర్శకుడెవరు, హీరో ఎవరు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు,నిర్మాతల వివరాలను తాను త్వరలో చెబుతానని తెలిపారు పృథ్వీ. `ప్రముఖ రచయిత, దర్శకుడు నాకు ఒక బంపర్‌ ఆఫర్ ఇచ్చారు. `బ్రో` చిత్రంలో శ్యాంబాబు పాత్ర నిమిషం ఐదు సెకన్లపాటు ఉంది. నేను  చేయబోయే `శోభన్‌బాబు` సినిమాలో రెండు గంటలు ఉంటుంది.  నాకు అద్భుతమైన అవకాశం ఇది. ఆ రచయిత, దర్శకుడు, బ్యానర్‌ వివరాలు త్వరలోనే తెలియజేస్తా. అది నా కెరీర్‌ని మలుపుతిప్పే చిత్రం అవుతుంది. ఈ శ్యాంబాబుని అప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని సెల్ఫీ వీడియోని పంచుకున్నారు పృథ్వీ. 

దీంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి అందులో `శ్యాంబాబు` పాత్ర పొలిటికల్‌ సెటైరికల్‌గా ఉంటుందా? లేక పూర్తి భిన్నంగా, కేవలం కామెడీ పాత్రగానే ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. కానీ పృథ్వీ ఈ విషయం చెప్పినప్పట్నుంచి ఇది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది. పృథ్వీ చేత ఎవరో గట్టిగానే ఏపీ ప్రభుత్వాన్ని గిల్లించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?