ఈసారి గెలుపు ఎవరిది?

Published : Sep 18, 2017, 02:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఈసారి గెలుపు ఎవరిది?

సారాంశం

జై లవ కుశ తో వస్తున్న ఎన్టీఆర్ స్పైడర్ తో వస్తున్న మహేష్ బాబు నాలుగోసారి బాక్సాఫీస్ వద్ద తలపడుతున్న మహేష్, ఎన్టీఆర్

ఒక హీరో సినిమా విడుదలౌతుంది అంటే.. ఆ సినిమా హీరో దగ్గర నుంచి నిర్మాత వరకు.. ఆఖరికి ఆ హీరో అభిమానుల దాకా ఫలితం ఎలా ఉంటుందా అనే టెన్షన్ ఉంటుంది. అలాంటిది ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే.. ఆ టెన్షన్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో అదే టెన్షన్ కనపడుతోంది.

 

దసరా పండగకు వారం రోజుల తేడాతో ఎన్టీఆర్, మహేష్ ల సినిమాలు విడుదలౌతున్నాయి. జై లవ కుశ తో ఎన్టీఆర్, స్పైడర్ తో మహేష్.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరిద్దరిలో ఎవరి సినిమా విజయం సాధిస్తుందా అని ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

 

గతంలో మూడుసార్లు ఎన్టీఆర్, మహేష్ ల సినిమాలో పోటీపడ్డాయి. 2003లో ఎన్టీఆర్ నాగ, మహేష్ ఒక్కడు ఒకేసారి విడుదల కాగా.. విజయం మహేష్ ని వరించింది. 2010లో ఎన్టీఆర్ బృందావనం బ్లాక్ బస్టర్ కాగా.. అదే సమయంలో విడుదలైన మహేష్ ఖలేజా డిజాస్టర్ గా నిలిచింది.  తర్వాత 2011లో ఎన్టీఆర్ ఊసరవల్లి యావరేజ్ గా ఆడగా.. మహేష్ దూకుడు బ్లాక్ బస్టర్ అయ్యింది.

 

వీరిద్దరూ తాజాగా మరోసారి పోటీపడుతున్నారు. అయితే.. ఈ సారి గెలుపు ఎవరి సొంతం అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఏ సినిమా అంచనాలను నిజం చేస్తుందో వేచి చూడాలి.

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం