మెగాస్టార్ ‘సైరా’ లో సునీల్

Published : Sep 18, 2017, 02:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
మెగాస్టార్ ‘సైరా’ లో సునీల్

సారాంశం

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ హీరోగా రాణించలేకపోయిన సునీల్ చిరంజీవి సైరా సినిమాల కీలక పాత్రలో సునీల్

కమెడియన్ గా సినీ కెరీర్ ని ప్రారంభించిన నటుడు సునీల్. అయితే.. కమెడియన్ గా రాణించిన సునీల్.. హీరోగా రాణించలేకపోయాడు.  మర్యాద రామన్న తప్ప.. పెద్దగా చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. ఇటీవల విడుదలైన ఉంగరాల రాంబాబు కూడా ఆయనకు నిరాశే మిగిల్చింది. ఇక సునీల్ కెరిర్ ముగిసినట్టేనని అందరూ ఫీల్ అయ్యారు.

 

సునీల్ కూడా అంతే ఫీలైనట్టున్నారు.. అందుకే సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. తన కెరిర్ ని తిరిగి గాడిలో పెట్టుకునేందుకు  మళ్లీ కమెడియన్ గా చేస్తానంటూ ప్రకటించాడు. అయితే.. హీరోగా ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని చెప్పారు.

 

ఆయన అలా ప్రకటించాడో లేదో.. ఒక భారీ ఆఫర్ సునీల్ ని వరించింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరాలో సునీల్ కి అవకాశం లభించింది. ఓ కీలక పాత్రకోసం సునీల్ ని ఎంచుకున్నారు. దీని గురించి సునీల్ మాట్లాడుతూ.. తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఖైదీ నెం.150లోనే చేయాల్సిందని కాకపోతే..కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నారు. ఇప్పుడు మళ్లీ చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కమిడియన్ పాత్రలతోపాటు.. విలన్ పాత్రల్లోనూ నటించాలని ఉందంటూ  సునీల్ ఈ సందర్భంగా తన మనసులో మాట బయటపెట్టాడు. మరి సునీల్ కోరికను ఏ దర్శకుడైనా తీరుస్తాడేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం