మహేష్ కొంచెం ఆలోచిస్తే మంచిదేమో?

Published : Dec 26, 2018, 04:51 PM IST
మహేష్ కొంచెం ఆలోచిస్తే మంచిదేమో?

సారాంశం

మహేష్ డిజాస్టర్స్ అందుకున్న ప్రతిసారి ఆ తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా ఆలోచిస్తాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో అనుభవాలను నేర్చుకొన్న మహేష్ మెయిన్ గా సక్సెస్ ఇచ్చే దర్శకులను అతిగా నమ్మి మోసపోయాడు. 

మహేష్ డిజాస్టర్స్ అందుకున్న ప్రతిసారి ఆ తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా ఆలోచిస్తాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో అనుభవాలను నేర్చుకొన్న మహేష్ మెయిన్ గా సక్సెస్ ఇచ్చే దర్శకులను అతిగా నమ్మి మోసపోయాడు. శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం తరువాత స్క్రిప్ట్ పూర్తిగా వినే వరకు ప్రాజెక్ట్ సెట్ చేయడం లేదని తెలిసింది. 

అయితే ఇప్పుడు మళ్ళీ పాత పద్దతిలోనే మరో దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు టాక్ వస్తోంది. తన 25వ సినిమా మహర్షిని వంశీ పైడి పల్లి దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా సినిమా షూటింగ్ కూడా ఎండ్ అవ్వలేదు. అప్పుడే వంశీ టేకింగ్ ను మెచ్చి ఈ ప్రాజెక్ట్ ఎండ్ అవ్వగానే మరో స్క్రిప్ట్ రెడీ చేసుకో చేసేద్దామని మాట ఇచ్చేశాడట.    

అయితే సినిమా రిలీజ్ అవ్వకముందే మహేష్ ఇలా మాట ఇచ్చే ముందు కొంచెం ఆలోచిస్తే బెటర్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలే మహేష్ సెకండ్ టైమ్ వర్క్ చేసే దర్శకులతో వర్కౌట్ కాదనే బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. భరత్ అనే నేను ఫ్యాన్స్ కి బాగా నచ్చినప్పటికీ శ్రీమంతుడు స్థాయిలో లేదనే విమర్శలు కూడా వచ్చాయి. 

ఇక ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేసే వంశీ మహర్షి కథతోనే మొదట మహేష్ ను ఆకర్షించాడు. వర్క్ తో మరింతగా షూటింగ్ దశలోనే మెప్పించాడు. తప్పకుండా సినిమా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. దీంతో నెక్స్ట్ సుకుమార్ తో సినిమా చేశాక మహేష్ వంశీతోనే మరో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి