గల్లా జయదేవ్ విజయంపై కామెంట్ చేసిన మహేష్

By Prashanth MFirst Published 25, May 2019, 7:14 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సినీ తారలు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పెడుతున్నారు. స్టార్ హీరోలు ఇంకా చేయడం లేదేంటి అనుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎలక్షన్స్ పై వరుస కామెంట్స్ చేశాడు. ముందుగా మోడీ - వైఎస్ జగన్ లపై స్పందించాడు. 

వారి విజయానికి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ ఫైనల్ గా తన బావ గల్లా జయ దేవ్ విజయంపై కూడా స్పందించాడు. వరుసగా సెకండ్ టైమ్ కూడా  గుంటూరు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన గల్లా జయదేవ్ గారికి శుభాకాంక్షలు అంటూ.. ఈ విజయం గర్వకారణంగా ఉందని మహేష్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

Big congratulations to for winning the MP seat second time around!! Very proud :)

— Mahesh Babu (@urstrulyMahesh)

టీడీపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ గుంటూరు లోక్ సభ ఎన్నికలో 4205ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై గెలిచిన విషయం తెలిసిందే. 

Last Updated 25, May 2019, 7:17 PM IST