సైలెంట్ గా అనుష్క 'నిశ్శబ్దం' మొదలైంది

By Prashanth MFirst Published 25, May 2019, 6:04 PM IST
Highlights

టాలీవుడ్ స్వీటీ అనుష్క బాహుబలి - బాగమతి సినిమాల అనంతరం ఇచ్చిన గ్యాప్ ఆమె కెరీర్ లో ఇదే మొదటిసారి. వన్ ఇయర్ కి పైగా వేడితెరకు సెలవులిచ్చిన అమ్మడు ఇప్పుడు నిశ్శబ్దం అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. మరోసారి కూడా బేబీ థ్రిల్లర్ జానర్ ని ఎంచుకుంది. 

టాలీవుడ్ స్వీటీ అనుష్క బాహుబలి - బాగమతి సినిమాల అనంతరం ఇచ్చిన గ్యాప్ ఆమె కెరీర్ లో ఇదే మొదటిసారి. వన్ ఇయర్ కి పైగా వేడితెరకు సెలవులిచ్చిన అమ్మడు ఇప్పుడు నిశ్శబ్దం అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. మరోసారి కూడా బేబీ థ్రిల్లర్ జానర్ ని ఎంచుకుంది. భాగమతి అనంతరం ఎన్ని కథలొచ్చినా లెక్క చేయని అమ్మడు సైలెన్స్ అనే డిఫరెంట్ స్క్రిప్ట్ ను ఎంచుకుంది. 

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం మొదలయ్యింది. హేమంత్  తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు - తమిళ్ అలాగే హిందీ - ఇంగ్లిష్ భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. 

తెలుగులో తప్ప మిగతా భాషల్లో ఈ సినిమాకు సైలెన్స్ అనే టైటిల్ ని సెట్ చేశారు. ఇక దర్శకుడు హేమంత్ ఇంతకుముందు తెలుగులో మంచు విష్ణు 'వస్తాడు నా రాజు' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే బాలీవుడ్ లో ముంబై 125KM అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అనుష్కతో చేస్తోన్న నిశ్శబ్దం ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.  

Last Updated 25, May 2019, 6:04 PM IST