పవన్ ఓటమిపై నిఖిల్ సెటైర్..?

By AN TeluguFirst Published 25, May 2019, 5:04 PM IST
Highlights

తాను రెండు చోట్ల ఓడిపోయినా.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకి సరైన ఆదరణ రాకపోయినా తుదిశ్వాస వరకూ రాజకీయాల్లోనే కొనసాగుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. 

 

తాను రెండు చోట్ల ఓడిపోయినా.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకి సరైన ఆదరణ రాకపోయినా తుదిశ్వాస వరకూ రాజకీయాల్లోనే కొనసాగుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ రామ్ చరణ్ ఇప్పటికే ట్వీట్ చేసారు. ఇప్పుడు మరో యంగ్  హీరో నిఖిల్ ..పవన్ ఫెయిల్యూర్ ని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసారు. 

“ప్రతీది ఒకటితోనే మొదలవుతుంది. జనసేన పార్టీ రాజోల్ లోని ఒక సీటుతో ప్రారంభం అయ్యింది. భవిష్యత్ లో ఇది మరింతగా ఎదగటానికి మంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నా .”  అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చూసిన చాలా మంది పుండు మీద కారం జల్లినట్లు ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

నిఖిల్ ఈ పోస్ట్ ని సూపర్ పాజిటివ్ గా చేసినా పదాల అల్లిక సరిగా లేకపోవటం కొంప ముంచుతోంది. పవన్ కళ్యాణ్ కు ఒకే సీటు వచ్చిందని ఎద్దేవా చేస్తన్నాడని కొందరు విశ్లేషిస్తున్నారు.  నిఖిల్ కామెంట్ ఏంటనేది క్రింద ట్వీట్ లో చూడండి.

 

Everything Begins with 1...
Janasena Party wins its 1st seat from Razole..
Hope it's the Start of Bigger things in the future. https://t.co/sctBNgOPCz

— Nikhil Siddhartha (@actor_Nikhil)
Last Updated 25, May 2019, 5:04 PM IST