
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అభిమానులను ఖుషీ చేయడానికి చిత్రబృందం టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఉగాది కానుకగా ఏప్రిల్ 6న ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాను మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు