'మజిలీ' మూవీ ఫస్ట్ రివ్యూ..!

Published : Apr 04, 2019, 04:52 PM ISTUpdated : Apr 04, 2019, 05:00 PM IST
'మజిలీ' మూవీ ఫస్ట్ రివ్యూ..!

సారాంశం

అక్కినేని నాగ చైతన్య, సమంత అంటే హిట్ కాంబినేషన్. 'ఏ మాయ చేసావె', 'మనం' వంటి చిత్రాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అక్కినేని నాగ చైతన్య, సమంత అంటే హిట్ కాంబినేషన్. 'ఏ మాయ చేసావె', 'మనం' వంటి చిత్రాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. అదే 'మజిలీ'. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పెళ్లి తరువాత చై-సామ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం, 'నిన్ను కోరి' వంటి హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ లో ఎమోషన్స్ పీక్స్ లో ఉండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ రివ్యూ ఇచ్చి సినిమాపై అంచనాలు మరింత పెంచేశాడు నటుడు సుశాంత్. సినిమా చూసిన సుశాంత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అందమైన కథను దర్శకుడు చాలా సున్నితంగా డీల్ చేశాడని.. లవ్, పెయిన్ రెండిటినీ బాగా ఆస్వాదించినట్లు చెప్పాడు. 

సినిమాలో సమంతా, చైతు జీవించేశారని, పాత్రలకు ప్రాణం పోశారని చెప్పాడు. మొదటి సినిమా అయినా.. దివ్యాంక బాగా నటించిందని.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గోపిసుందర్ మ్యూజిక్ హృదయాలను హత్తుకునేలా ఉందని అన్నారు. మజిలీ సినిమా అందమైన అనుభూతి అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..