'మహర్షి' టీమ్ ని ఇబ్బంది పెడుతోన్న మహేష్..?

Published : Apr 04, 2019, 04:39 PM IST
'మహర్షి' టీమ్ ని ఇబ్బంది పెడుతోన్న మహేష్..?

సారాంశం

ఇప్పటికే విడుదల కావాల్సిన మహేష్ బాబు 'మహర్షి' సినిమా ఇప్పుడు మే కి వెళ్లింది. మే 9న రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. 

ఇప్పటికే విడుదల కావాల్సిన మహేష్ బాబు 'మహర్షి' సినిమా ఇప్పుడు మే కి వెళ్లింది. మే 9న రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. అయితే దీనంతటికీ కారణం మహేష్ బాబు అని టాక్. 

ఇప్పటికే సినిమా షూటింగ్ కోసం చాలా ఖర్చు పెట్టారు. మహేష్ అవుట్ డోర్ షూటింగ్ కి రానని చెప్పడంతో భారీ ఖర్చుతో సెట్ లను నిర్మించారు. పోనీ షూటింగ్ అయినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తున్నారా..? అంటే అదీ లేదు.

మహేష్ తన నటిస్తున్న యాడ్స్ కోసం 'మహర్షి' సినిమా షూటింగ్ వాయిదా వేస్తున్నాడట. ఆ కారణంగానే సినిమా షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని సమాచారం. మరో రెండు  పాటలు బ్యాలన్స్ పెట్టుకొని ఇలాంటి సమయంలో మహేష్ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం వెళ్లిపోయాడట.

స్టార్ హీరో కావడంతో దర్శకనిర్మాతలు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని తెలుస్తోంది. వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కంప్లీట్ చేసి  అనుకున్న టైమ్ కి ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Badi Panthulu Review: ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన ఏకైక చిత్రం, విలువలు నేర్పిన బడిపంతులు సినిమా
Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే