ఆ ప్రచారమే.. 'మహర్షి' బిజినెస్ కు దెబ్బ?

By Udaya DFirst Published Apr 1, 2019, 9:50 AM IST
Highlights

మహేష్‌ ప్రస్తుతం నటిస్తోన్న మహర్షి కథకి, మహేష్‌ ఇంతకుముందు చేసిన శ్రీమంతుడు కథకి పోలికలున్నాయనే ప్రచారం  బాగా జరుగుతోంది. 

మహేష్‌ ప్రస్తుతం నటిస్తోన్న మహర్షి కథకి, మహేష్‌ ఇంతకుముందు చేసిన శ్రీమంతుడు కథకి పోలికలున్నాయనే ప్రచారం  బాగా జరుగుతోంది. అదే ఇప్పుడు  ఈ ప్రాజెక్టుకు బిజినెస్ పరంగా దెబ్బ కొడుతోందంటున్నారు. శ్రీమంతుడు చిత్రం మాదిరిగానే అపర  కోడీశ్వరుడైన హీరో ఓ కారణం మీద పల్లెకి రావడం, అక్కడ జనాల్లో ఉత్తేజం నింపటం  ఈ చిత్ర ఇతివృత్తమంటున్నారు. అయితే శ్రీమంతుడుకు ఈ సినిమాకూ తేడా ఏంటంటే..శ్రీమంతుడు లాగ సోషల్‌ మెసేజ్‌ కాకుండా ఒక వ్యక్తి తాలూకు పర్సనల్‌ జర్నీని ఇందులో చూపిస్తారని అంటున్నారు.

గతంలో నాగ్, కార్తీలతో తీసిన  ఊపిరి చిత్రానికి వచ్చిన ప్రశంసలతో వంశీ పైడిపల్లి మళ్లీ అలాంటి హ్యూమన్ రిలేషన్స్ తో కూడిన కథ  ని తెరకెక్కిస్తున్నాడు. మహేష్‌ తన ఇరవై అయిదవ చిత్రం స్పెషల్‌గా వుండాలని యాక్సెప్ట్ చేసారు. అంతవరకూ బాగానే ఉంది కానీ శ్రీమంతుడు కాన్సెప్టు కు దగ్గరగా ఉండే ఈ సినిమా ..ఆ మళ్లీ శ్రీమంతుడునే తీసారంటారని, అందుకుని నిర్మాతలు చెప్తున్న రేట్లు పెట్టి కొనలేమని అన్నారట. 

అయితే సినిమా రిలీజ్ కాకుండా ఆ కథ, మహర్షి కథ ఒకటి అని ఎలా అంటారని, అలా ఒకటే అయితే మహేష్ ఎందుకు చేస్తారు..మేము ఎందుకు ప్రొడ్యూస్ చేస్తామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారట. ముఖ్యంగా ఓవర్ సీస్ డిస్టిబ్యూటర్స్ నుంచే ఈ సమస్య ఎదురైందిట.  మీడియాలో వచ్చే వార్తల నమ్మి మాట్లాడవద్దని,సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని దిల్ రాజు నచ్చచెప్పి తాము చెప్తున్న రేటుకే అమ్మే ప్రయత్నం చేస్తున్నారట.

అంతేకాకుండా ఈ చిత్రంలో కమర్షియల్‌ యాస్పెక్ట్‌ తో పాటు ఎమోషనల్‌ గా  కనక్ట్‌ అయ్యే కంటెంట్ ఎక్కువ వుంటుందని, మహేష్‌ కెరియర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్‌ అవుతుందని చెప్పారట. సెకండాఫ్ లో  కాస్త సీరియస్‌ ఎమోషనల్‌ డ్రామా  ఉన్నా..మిగతాదంతా మహేష్ సరదాగా, పాటలతో మాస్ కు పట్టే ఎలిమెంట్స్ తో ఉన్నాయట. 

ఇక 'మహర్షి' కథ విషయానికి వస్తే మహేష్ ప్రపంచంలో ఉండే టాప్ 5 బిలియనీర్స్ లో ఒకరు. కానీ తన చిన్ననాటి స్నేహితుడు అల్లరి నరేష్  కోసం తెలుగు రాష్ట్రంలోని ఒక గ్రామానికి వచ్చి రైతు సమస్యలు తీర్చేందుకు  కొత్త విధానాలతో ప్రయత్నిస్తాడట.   

click me!