అపర చాణిక్యుడుగా పేరుబడ్డ పి.వి. నరసింహారావు గురించి జాతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల పితామహుడు పి.వి. నరసింహారావు భారతదేశ చరిత్రను ఒక మలుపు తిప్పారు.
అపర చాణిక్యుడుగా పేరుబడ్డ పి.వి. నరసింహారావు గురించి జాతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల పితామహుడు పి.వి. నరసింహారావు భారతదేశ చరిత్రను ఒక మలుపు తిప్పారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మంత్రిగా, ముఖ్య మంత్రిగా బిసిలకు విద్య, ఉద్యోగరంగంలో రిజర్వేషన్‌లు కల్పించారు. ఆయన జీవితం ఆధారంగా ‘పి.వి. నరసింహారావు- ఛేంజ్ విత్ కంటిన్యుటీ’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందుతోంది. అందుకు సంభందించిన ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇందులో నరసింహారావుతో కలిసి పనిచేసిన మంత్రులు, ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు చెప్పిన సమాచారాన్ని చూపించారు. నరసింహారావు గొప్ప నాయకుడని, ప్రజల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారని వారు వివరించారు.
1991లో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని వర్ణించారు. జూన్‌లో ఈ పూర్తి డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారు.
ఇక పీవి సుప్రసిద్ధ సాహితీవేత్త కూడా. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. తన జీవితంలోకి రాజకీయాలలోని అనేక పార్శ్వాలను ‘ఇన్‌సైడర్’ (లోపలి మనిషి) పేరుతో ప్రచురించారు. ఆ విశేషాలు కూడా ఈ డాక్యుమెంటరీలో చోటు చేసుకుంటాయేమో చూడాలి.