సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహానుభావుడు’

Published : Sep 21, 2017, 06:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహానుభావుడు’

సారాంశం

శర్వానంద్ హీరోగా మహానుభావుడు దసరా బరిలో మహానుభావుడు సెన్సార్ పూర్తి చేసుకున్న మహానుభావుడు

విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ.. వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ హీరో శర్వానంద్. ప్రస్తుతం ఆయన నటించిన ‘ మహానుభావుడు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దసరా బరిలో ఎన్టీఆర్ జై లవ కుశ, మహేష్  స్పైడర్ లతో ఈ సినిమా పోటీ పడుతోంది.

 

ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గురువారం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారి చేసింది. కనీసం ఒక్క సీన్ కూడా సెన్సార్ బోర్డ్ కట్ చేయకపోవడం విశేషం. శర్వానంద్ సరసన మెహరీన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు.

 

ఈ సినిమాలో శర్వానంద్.. ఓ వింత జబ్బుతో బాధపడుతుంటాడు. అతి శుభ్రత ఆ జబ్బు లక్షణం. అలాంటి అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే అంశంతో ఈ కథ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్