పవన్ చేతుల మీదుగా ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్?

Published : Sep 21, 2017, 05:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
పవన్ చేతుల మీదుగా ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్?

సారాంశం

రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ దసరా కానుకగా  రంగస్థలం ఫస్ట్ లుక్ పవన్ చేతుల మీదుగా విడుదల చేస్తారని టాక్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం 1985’. గతేడాది ధ్రువ చిత్రంతో హిట్ కొట్టిన చెర్రీ.. ఆ తర్వాత చేస్తున్న సినిమా ఇదే.  శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

 

ఇప్పటి వరుక సినిమా పోస్టర్ తప్ప.. మరెలాంటి డిటైల్స్ బయటకు రాకుండా చిత్ర బృందం జాగ్రత్తపడుతూ వస్తోంది. ఇటీవల చిరంజీవి, రాజమౌళిలు రంగ స్థలం షూటింగ్ స్పాట్ కి వెళ్లిన ఫోటోలు మాత్రం ఇటీవల నెట్టింట సందడి చేస్తాయి. కనీసం సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకపోవడంతో మెగా అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.

దీంతో మెగా ఫ్యాన్స్ కి ఓ హ్యాపీ న్యూస్ చెప్పిందట చిత్ర యూనిట్. దసరా కానుకగా ఫస్టులుక్ ను విడుదలచేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. ఇక ఫస్ట్ లుక్ అదిరిపోయే లెవెల్లో చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందని సమాచారం.  ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా  'రంగస్థలం 1985' ఫస్ట్ లుక్  రిలీజ్ చేస్తున్నట్లు టాక్.

 

'నాయక్' ఆడియో ఫంక్షన్ తరువాత పవన్ వస్తాడని చెబుతోన్న చరణ్ సినిమా ఇదే. దాంతో మెగా అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటి వరకు లవ్, యాక్షన్ తరహా చిత్రాల్లో నటించిన రాంచరణ్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట. నటుడిగా తన సత్తాను చాటే చిత్రమవుతుందని చరణ్ భావిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన సమంత నటిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్